Daughter: తండ్రి కోసం కాలేయాన్ని దానం చేసిన కూతురు..
కేరళలో ఓ కూతురు తండ్రికి కాలేయం దానం చేసింది.
చాలా మంది తల్లిదండ్రులు కొడుకు పుట్టలేదని బాధపడుతుంటారు. ముఖ్యంగా తండ్రైతే కుమారుడు జన్మించలేదని దిగులు చెందుతుంటాడు. కానీ ఎవరైనా ఒకటేనని తెలుసుకోరు. కొడుకు కంటే కూతురే గొప్ప చాలా సంఘటనలు నిరూపించాయి. తాజాగా కేరళలో 17 ఏళ్ల బాలిక తన తండ్రిని రక్షించడానికి కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసింది. కోర్టుకు వెళ్లి మరి అనుమతి తీసుకుని తండ్రికి కాలేయం దానం చేసింది.

హెపాటోసెల్లర్ క్యాన్సర్
త్రిసూర్ జిల్లాలోని కొలాజీకి చెందిన 48 ఏళ్ల ప్రతీష్ స్థానికంగా కేఫ్ నిర్వహిస్తున్నాడు. అతనికి 17 ఏండ్ల కుమార్తె దేవానంద ఉంది. ఆమె ప్రస్తుతం 12 వ తరగతి చదువుతోంది. అయితే గత కొంత కాలంగా ప్రతీష్ అనారోగ్యానికి గురి కావడంతో ఆసుపత్రిలో చేరాడు. పరీక్షించిన డాక్టర్లు అతను హెపాటోసెల్లర్ క్యాన్సర్‌తోపాటు దీర్ఘకాలిక కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడని తెలిపారు.

ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్
వెంటనే కాలేయ మార్పిడి చేయాలని సూచించారు. తన తండ్రికి సరైన దాత దొరకకపోవడంతో కాలేయాన్ని దానం చేయాలని నిర్ణయించుకుంది. అయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ యాక్ట్, 1994 ప్రకారం మైనర్‌ల నుండి అవయవాలను దానం చేయడానికి అనుమతి లేదు. దీంతో దేవానంద కేరళ హైకోర్టుకు వెళ్లారు.
ఈ విషయంలో న్యాయమూర్తి వి జి అరుణ్ కాలేయాన్ని దానం చేసేందుకు దేవానందకు అనుమతి ఇచ్చారు.

శస్త్ర చికిత్స
ఫిబ్రవరి 9న ఇక్కడి రాజగిరి ఆసుపత్రిలో ప్రతీష్ కు శస్త్ర చికిత్స నిర్వహించినట్లు ఆసుపత్రి ప్రకటనలో తెలిపారు ఈ శస్త్ర చికిత్సలో రాజగిరి హాస్పిటల్‌లోని మల్టీ-ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసెస్ చీఫ్ డాక్టర్ రామచంద్రన్ నారాయణ మీనన్, ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు పాల్గొన్నారు. దేవానంద దేశంలోనే అవయవ దానం చేసిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది.












Click it and Unblock the Notifications