Kerala: అదృష్టమంటే ఇదే.. రాత్రికి రాత్రే రూ.25 కోట్లు వచ్చాయి..

కొంత మంది అదృష్టం కలిసొచ్చి ఒక్క రోజులోనే కోటీశ్వరులుగా మారుతారు. ఇలానే ఓ వ్యక్తి జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. అతను లక్కీ డ్రాలో ఏకంగా రూ.25 కోట్లు గెలిచాడు. తమిళనాడుకు చెందిన నటరాజన్ స్థానికంగా ఉపాధి కరువడంతో బతుకుదెరువు కోసం కేరళ వెళ్లాడు. అక్కడే ఉండి జీవనం కొనసాగిస్తున్నాడు. మధ్యతరగతికి చెందిన నటరాజన్ కు లాటరీలు కొనే అలవాటు ఉంది. అతను ప్రతి సంవత్సరం లాటరీ టికెట్లు కొంటుంటాడు.

నటరాజన్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటున్నాడు. ఈ సంవత్సరం కూడా నటరాజన్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. కేరళలో ఓనం పండుగా సందర్భంగా ప్రతి సంవత్సరం అతిపెద్ద లాటరీ లక్కీ డ్రా నిర్వహిస్తుంటారు. ఈ లక్కీ డ్రా మొదటి బహుమతి రూ.25 కోట్లు . ఈ లాటరీలోనే నటజరాన్ లాటరీ టికెట్ కొన్నారు. ఈ రూ.25 కోట్లు మొదటి బహుమతి నటరాజన్ కు తగిలింది. దీంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

In Kerala, a man named Natarajan won a lottery prize of Rs.25 crores

కేరలో లాటరీ డ్రా తీయడం ఎప్పటి నుంచో వస్తుంది. కేరళ పెద్ద పెద్ద పండుగలకు లాటరీ లక్కీ డ్రా తీస్తుంటారు. ఓనం, క్రిస్మస్, విషు పండుగల సమయాల్లో కేరళ లాటరీ డిపార్ట్ మెంట్ లాటరీ టికెట్లను జారీ చేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా తిరుఓనం పండుగు పురస్కరించుకుని తిరుఓనమ్ బంపర్ బీఆర్ 93 లాటరీ పేరుతో దాదాపు 66 లక్షల లాటరీ టికెట్లు అమ్మారు. ఇందులో భాగంగానే నటరాజన్ ఓ టికెట్ కొన్నాడు.

సెప్టెంబర్ 20న కేరళ ప్రభుత్వం బీఆర్ 93 లక్కీ డ్రా నిర్వహించింది. ఈ లక్కీ డ్రాలో తమిళనాడు కోయంబత్తూర్ కు చెందన నటరాజన్ మొదటి బహుమతి వచ్చింది. తిరుఓనం బంపర్ బీఆర్ -93 లక్కీ డ్రాలో TE230662 టికెట్ కు మొదటి బహుమతి కింద రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ అతనికి వచ్చింది. రూ.25 కోట్లలో 30 శాతం ట్యాక్స్ పోగా...అతడికి రూ.17.5 కోట్లు అందనున్నాయి. రెండో విజేతకు రూ.కోటి, మూడో విజేతకు రూ. 50లక్షలు, నాలుగో విజేతకు రూ. 5లక్షల చొప్పున అందనున్నాయి. విషు బంపర్ బీఆర్ 91 కింద నిర్వహించిన లాటరీలో VE 475588 నంబరు తొలి ప్రైజ్ దక్కించుకుంది. ఈ లాటరీ టికెట్ కు రూ. 12 కోట్లు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+