కొత్త నోట్ల కట్నం ఇవ్వలేదని నవవధువును చంపేశారు
కొత్తగా పెళ్లయిన అమ్మాయికి వరకట్నంగా ఆమె తల్లిదండ్రులు ఇస్తానన్న సొమ్మును కొత్త నోట్లలో ఇవ్వలేదన్న కారణంతో అత్తమామలు కోడలి ప్రాణాలను బలి తీసుకున్నారు.
భువనేశ్వర్: పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఓ నవ వధువు మృతికి దారి తీసింది. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి వరకట్నంగా ఆమె తల్లిదండ్రులు ఇస్తానన్న సొమ్మును కొత్త నోట్లలో ఇవ్వలేదన్న కారణంతో అత్తమామలు కోడలి ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ ఘటన ఒడిసాలోని గంజామ్ జిల్లా రంగీపూర్ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
ప్రభాసిని మండల్ అనే యువతికి అదే గ్రామానికి చెందిన లక్ష్మీ నహక్ అనే యువకుడితో ఈ నెల 9వ తేదీన పెళ్లయింది. పెళ్లికి కట్నంగా రూ.1.70 లక్షలు ఇస్తామని అమ్మాయి తల్లిదండ్రులు తెలిపారు. అయితే పెళ్లికి ముందురోజే పెద్ద నోట్లు రద్దు కావడంతో కట్నం మొత్తాన్ని కొత్త నోట్లు ఇవ్వాల్సిందిగా వరుడి తల్లిదండ్రులు కోరారు.

అయితే అప్పటికి వధువు తల్లిదండ్రుల వద్ద రద్దయిన రూ.500, 1000 నోట్లు మాత్రమే ఉండడంతో కొద్ది రోజుల్లో వాటిని మార్పించి కొత్త నోట్లు ఇస్తామని చెప్పారు. కానీ, పది రోజులైనా వాటిని మార్పించడం సాధ్యం కాలే దు. దీంతో యువతిని ఆదివారం రాత్రి అత్తమామల వేధించినట్లు చెబుతున్నారు. వేధింపులు భరించలలేక ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.
అయితే భర్త, అత్తమామలు కలిసి తన కూతురిని హత్య చేసినట్లు మృతురాలి తల్లి ఆరోపించారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications