దమ్ముంటే బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని బిజెపికి మాయావతి సవాల్
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చింది కాదని ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అని బిఎస్ పి చీప్ మాయావతి ఆరోపించారు.
న్యూఢిల్లీ:ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చింది కాదని ఈవీఎంలు ఇచ్చిన తీర్పు అని బిఎస్ పి చీప్ మాయావతి ఆరోపించారు.బ్యాలెట్ పేపర్ల ద్వారా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
బీజేపీ నిజంగా దమ్ముంటే గెలుస్తామన్న నమ్మకముంటే ప్రస్తుతం జరిగిన ఎన్నికలను రద్దుచేసి బ్యాలెట్ పేపర్లతో మరోసారి ఎన్నికలను నిర్వహించాలని రాజ్యసభలో మంగళవారం నాడు ఆమె డిమాండ్ చేశారు.
రాజ్యసభలో బిఎస్ పి ఈ అంశాన్ని లేవనెత్తింది. ఉత్తర్ ప్రదేశ్ , ఉత్తరాఖండ్ ఎన్నికల్లో బయటకొచ్చిన తీర్పు ప్రజలు ఇచ్చింది కాదనీ, ఈవీఎంలు ఇచ్చాయని ఆరోపించారు.

ఈ విషయంపై ప్రత్యేక చర్చ జరపాల్సిందేనని తమ పార్టీ సభలో నోటీసులు కూడ ఇచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈవీఎంలను బిజెపి వ్యతిరేకించిందని ఆమె గుర్తు చేశారు.
బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. కానీ, ఇప్పడు మాత్రం అదే బీజెపి ఈవీఎంలకు మద్దతివ్వడాన్ని ఆమె తప్పుబట్టారు. తమ పార్టీకి వేసిన ఓట్లన్నీ కూడ ఈవీఎంలను ట్యాంపరింగ్ కు గురిచేసి బీజేపీ తనకు పడేలా చేసుకొందని ఆయన ఆరోపించారు.












Click it and Unblock the Notifications