ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు: రూ. 50 కోట్లు పంచడానికి రెఢీ, ఎవరంటే !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: ఆర్ కే నగర ఉప ఎన్నికల్లో స్థానిక ఓటర్లకు భారీ మొత్తంలో నగదు పంపిణి చెయ్యడానికి రంగం సిద్దం అయ్యిందని వార్తలు గుప్పుమన్నాయి. ఎలాగైనా ఆర్ కే నగర్ నియోజక వర్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్న నాయకులు కోట్ల రూపాయలు కుమ్మరించడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

తమిళనాడు మంత్రుల జాతకాలు బయటపెడుతాం: పన్నీర్ వర్గం బాంబు !

జయలలిత మరణంతో ఆర్ కే నగర శాసన సభ నియోజక వర్గం ఖాళీ అయ్యింది. ఏప్రిల్ 12వ తేదిన పోలింగ్ జరగుంది. ఏప్రిల్ 10వ తేది సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే ఆర్ కే నగర్ నియోజక వర్గంలో అన్ని పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

In RK Nagar constituency Rs.50 crore is ready to give the voters by the patys.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ (శశికళ వర్గం) మద్దతుతో టీటీవీ దినకరన్ పోటీలో దిగారు. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

షాక్ అంటే ఇదే: ఆర్ కే నగర్ లో దినకరన్ కు హీరో శరత్ కుమార్ మద్దతు !

డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సందర్బంలో పలు పార్టీల నాయకులు ఆర్ కే నగర్ నియోజక వర్గం ప్రజలకు రూ. 50 కోట్ల వరకు డబ్బు పంపిణి చెయ్యడానికి సిద్దం అయ్యారని ఎన్నికల అధికారుల దృష్టికి వెళ్లింది.

ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ విషయంపై సీరియస్ గా చర్చిస్తున్నారు. ఎలాగైనా నగదు పంపిణి కాకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా భారీ మొత్తంలో నగదు పంపిణి చేస్తున్నారని పుకార్లు పుట్టించారా ? లేక నిజంగానే భారీ మొత్తంలో నగదు పంపిణి చెయ్యడానికి సిద్దం అయ్యారా ? అంటూ ఎన్నికల కమిషన్, అధికారులు ఆరా తీస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In RK Nagar constituency Rs.50 crore is ready to give the voters by the patys. Election commission official discussing how to stop the issue.
Please Wait while comments are loading...