రూ.199లకే ఉచిత కాల్స్, రోజూ 1 జీబీ డేటా: ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ. 199 లకే అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ డాటా, లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్‌లను ఇవ్వనున్నట్టు ప్రకటించింది.

బంపర్ ఆఫర్: రెడ్‌మీ 5ఏ ఫోన్‌పై రూ.వెయ్యి తగ్గింపు, మరో వెయ్యి జియో క్యాష్ బ్యాక్

రిలయన్స్ జియో మార్కెట్లోకి ఉచిత ఆఫర్లతో రంగ ప్రవేశం చేయడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ ఇదే బాటలో పయనిస్తున్నాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్ మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.

శుభవార్త: ఐ ఫోన్ ఎస్ఈ 32 జీబీ రూ.17,999, అమెజాన్ బంపర్ ఆఫర్

తన కష్టమర్లు ఇతర టెలికం కంపెనీల వైపుకు వెళ్ళకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అయితే టెలికం కంపెనీల మధ్య పోటీ కారణంగా టారిఫ్ ప్లాన్లలో మార్పులు చేర్పులు చోటు చేసుకొంటున్నాయి.

శుభవార్త: క్యాష్‌బ్యాక్ ఆఫర్, కనీస రీ చార్జీ రూ.150

 రూ.199లకే ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

రూ.199లకే ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్‌ను ముందుకు తీసుకువచ్చింది. రూ. 199కే అపరిమిత కాల్స్‌తో పాటు రోజుకు 1 జీబీ డాటా, లోకల్ అండ్ నేషనల్ ఎస్ఎంఎస్‌లను 28 రోజుల పాటు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్‌కు చిన్న షరత్ పెట్టింది. ఇన్‌కమింగ్ కాల్స్‌కు మాత్రమే రోమింగ్ ఉచితంగా ఇస్తూ.. ఔట్‌గోయింగ్ కాల్స్‌కి రోమింగ్ చార్జీ వేస్తున్నట్లు ఎయిటెల్ తన ఆఫర్‌ను ప్రకటించింది.

 రూ. 349 రీ ఛార్జీ చేస్తే

రూ. 349 రీ ఛార్జీ చేస్తే

రూ. 349తో రీచార్జ్‌ చేసుకునే వారికి 1.5 జీబీ 3జి/4జి డేటాను ఇవ్వనుంది. అంతేకాదు అపరిమిత కాల్స్‌తో పాటు.. లోకల్ , నేషనల్ ఎస్ఎంఎస్‌లు 28 రోజులపాటు ఇవ్వనున్నట్టు ప్రకటించింది ఎయిర్‌టెల్.

రూ.448 రీ ఛార్జీ చేస్తే

రూ.448 రీ ఛార్జీ చేస్తే

రూ. 448తో రీచార్జ్ చేసుకుంటే.. 1.5 జీబీ 3జి/4జి డాటా, అపరిమిత కాల్స్ ,ఎస్‌ఎంఎస్‌లతో 70 రోజుల పాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది. జియో ఇచ్చిన ఆఫర్లకు పోటీగా ఎయిర్‌టెల్ కూడ తన కష్టమర్లకుఆఫర్లను ప్రకటించింది.. అయితే జియో క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను ఇచ్చింది. ఈ పోటీని తట్టుకొనేందుకు ఎయిర్‌టెల్ ఈ ఆఫర్లను ప్రకటించింది.

ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే

ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే

రూ.199 ప్లాన్‌ను ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కష్టమర్లకు అందుబాటులో ఉంచనున్నట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది.పోటా పోటీగా ఆఫర్లను టెలికం కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ఏ కంపెనీ ఆఫర్ తక్కువగా ఉంటే కష్టమర్లు అటుగా వెళ్ళే అవకాశం కన్నిస్తోంది. దీంతో కష్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు పోటా పోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. జియో పోటీని తట్టుకొనేందుకుగాను ఎయిర్‌టెల్ ఈ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Amid intense competition in the telecom market, Bharti Airtel is offering 1 GB of mobile data along with unlimited calls for a month to its prepaid customers at Rs. 199 in select circles. Airtel's recharge pack of Rs. 199 comes with a validity period of 28 days.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి