గుజరాత్ రాజ్యసభ ఎన్నికల దెబ్బ: కాంగ్రెస్ పవర్ మంత్రికి ఐటీ సమన్లు, విచారణకు రండి !
కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు ఐటీ శాఖ అధికారులు రెండో సారి సమన్లు జారీ చేశారు. ఆగస్టు 10వ తేదీ గురువారం బెంగళూరులోని క్వీన్స్.
బెంగళూరు: కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు ఐటీ శాఖ అధికారులు రెండో సారి సమన్లు జారీ చేశారు. ఆగస్టు 10వ తేదీ గురువారం బెంగళూరులోని క్వీన్స్ రోడ్డులోని ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఐటీ శాఖ అధికారులు సూచించారు.
ఇప్పటికే ఒక సారి ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చెయ్యడంతో సోమవారం కర్ణాటక మంత్రి డీకే. శివకుమార్ విచారణకు హాజరైనారు. ఆదాయపన్ను శాఖ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని విచారణ అనంతరం డీకే. శివకుమార్ మీడియాకు చెప్పారు.

డీకే శివకుమార్ ఇంటిలో స్వాధీనం చేసుకున్న విలువైన ఆస్తుల పత్రాల పూర్తి వివరాలు సేకరించడానికి ఆదాయపన్ను శాఖ అధికారులు మళ్లీ ఆయనకు సమన్లు జారీ చేశారు. డీకే శివకుమార్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సమన్లు జారీ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు గురువారం వారిని విచారణ చెయ్యడానికి సిద్దం అవుతున్నారు. ఇప్పటికే ఆదాయపన్ను శాఖ అధికారులు వందకు పైగా ప్రశ్నలు సిద్దం చేసుకున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications