బెంగళూరులో గుజరాత్ వేడి: మంత్రి ఇంట్లో, రిసార్టులో ఐటీ దాడులు

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో రాజకీయ వేడి కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటు వేయకుండా ఉంటేందుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కర్నాటకకు తరలించింది.

బెంగళూరు/గాంధీనగర్: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బెంగళూరులో రాజకీయ వేడి కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యేలు బిజెపి అభ్యర్థికి ఓటు వేయకుండా ఉండేదుకు కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కర్నాటకకు తరలించింది.

వారిని ఓ రిసార్టులో ఉంచింది. ఈ నేపథ్యంలో ఐటీ (ఆదాయపన్ను శాఖ) షాకిచ్చింది. గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టు పైన, అలాగే కర్నాటక మంత్రి శివకుమార్ ఇళ్ల పైన ఐటీ సోదాలు నిర్వహించింది.

కనకాపుర, సదాశివనగర్‌లలోని మంత్రి శివకుమార్ నివాసాల్లో సోదాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి ఏడు గంటలకు సోదాలు ప్రారంభమయ్యాయి. రిసార్టులోని ఎమ్మెల్యేలు ఉన్న గదుల్లోను సోదాలు నిర్వహించారు.

Income Tax Dept raids Karnataka resort where Gujarat Congress MLAs are residing

మంత్రి నివాసంతో పాటు మంత్రి సోదరుడు డికె సురేష్ నివాసంలోను సోదాలు నిర్వహించారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సాయంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంత్రి సోదరుడికి క్లోజ్ ఫ్రెండ్ బాలాజీ నివాసంలోను సోదాలు నిర్వహించారు.

గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్టుకు తరలించింది. వీరి బాధ్యతను మంత్రి శివకుమార్ చూసుకుంటున్నారు. ఈగల్టన్ గోల్ఫ్ రిసార్టు బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+