ఐటీ దాడులు: దినకరన్ ఇంటిలో డిజిటల్ లాకర్లు, అధికారుల అవస్తలు, కోడ్ మరిచిపోయాను !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ ఫ్యామిలీ అక్రమాస్తుల కేసు లెక్క ఇప్పుడే ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు. శశికళ, ఆమె కుటుంబ సభ్యుల ఇళ్లలో శుక్రవారం సాయంత్రం వరకూ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మోడీ, పళని ప్లాన్: రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ఐటీ దాడులు, జైలు కొత్తకాదు, దినకరన్!

శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఇంటిలో రెండు గదుల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు డిజిటల్ లాకర్లు గుర్తించారు. డిజిటల్ లాకర్లు తీసి పరిశీలించాలని, వాటి సీక్రెట్ కోడ్ చెప్పాలని ఆదాయ పన్ను శాఖ అధికారులు టీటీవీ దినకరన్ కు సూచించారు.

Income Tax officers struggled open Digital lock in Dinakaran house

టీటీవీ దినకరన్ మాత్రం తాను కోడ్ మరిచి పోయానని, డిజిటల్ లాకర్లు ఉపయోగించి చాలకాలం అయ్యింది అంటూ తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించారని సమాచారం. డిజిటల్ లాకర్లు తీయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు చివరికి విఫలం అయ్యారని శుక్రవారం సాయంత్రం తమిళ మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి.

ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!

అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దృష్టి సారించారు. టీటీవీ దినకరన్ ముఖ్య అనచరుడు, అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ సెల్వన్ ప్రధాన అనుచరుడు కనగరాజ్ ఇంటిలో శుక్రవారం సాయంత్రం సోదాలు మొదలు పెట్టారు. శశికళ అనుచరులు ఎవ్వరినీ వదిలిపెట్టకూడదని ఆదాయ పన్ను శాఖ అధికారులు నిర్ణయించారని సమాచారం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Income Tax raid at many places in Tamilnadu . Income tax raids at a Dinakaran house and his properties. Income Tax officers struggled to open digital lock in Dinakaran House. Income Tax Department is conducting raid in the Thanga Tamilselvan assistant Kanagaraj house. Income tax raiding as second day in Sasikala family members and friends house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి