గాలి జనార్దన్ రెడ్డి కార్యాలయాలపై ఐటీ దాడులు
బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలైనాయి. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కార్యాలయాలపై ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు.
బళ్లారీలోని ఎఎంసీ, ఓఎంసీ కార్యాలయాలపై సోమవారం ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. కార్యాలయంలోని రికార్డులు పరిశీలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి గత బుధవారం తన కుమార్తె పెళ్లిని బెంగళూరు ప్యాలెస్ మైదానంలో ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.

వందల కోట్ల రుపాయల ఖర్చుతో గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చేస్తున్నారని పలువురు ఆరోపించారు. ఓ సామాజిక కార్యకర్త ( ఆర్ టీఐ కార్యకర్త) గాలి జనార్దన్ రెడ్డి అక్రమంగా సంపాధించిన డబ్బుతో తన కుమార్తె పెళ్లి చేస్తున్నారని ఐటీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications