శశికళ ఫ్యామిలీకి రెండో రోజూ ఐటీ షాక్, బెంగళూరులో పాత కారులో రూ. కోట్ల ఆస్తుల పత్రాలు !

Posted By:
Subscribe to Oneindia Telugu
  IT raids on Jaya TV just After 3 days of Modi-Karunanidhi meet

  చెన్నై/బెంగళూరు: ఆదాయపన్ను ఎగవేశారని ఆరోపిస్తూ శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ దాడులు రెండో రోజూ కనసాగుతున్నాయి. చెన్నై, తంజావూరు, తిరుచ్చి, బెంగళూరు, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో శుక్రవారం వేకువ జామున నుంచి సోదాలు మొదలైనాయి.

  శశికళ లిక్కర్ కంపెనీ మిడాస్ లో ఐటీ అధికారులు, దివాకరన్ విచారణ, 187 చోట్లు సోదాలు!

  పన్ను ఎగవేత, డొల్ల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ శశికళ, ఆమె కుటుంబ సభ్యులు, సమీప బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. గురువారం అర్దరాత్రి వరకూ సోదాలు చేసిన అధికారులు శుక్రవారం వేకువ జామున వరకూ విశ్రాంతి తీసుకుని మళ్లీ సోదాలు మొదలు పెట్టారు.

  Income Tax raids on VK Sasikala family continue second day

  బెంగళూరులోని మురగేశ్ పాళ్యలోని ఓ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న శశికళ అనుచరుడు, అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) కర్ణాటక శాఖ ప్రధాన కార్యదర్శి పుహళేంది ఇంటి ఎదురుగా ఉన్న మరో భవంతిలోని సెల్లార్ లో పార్క్ చేసిన పాత టాటా సుమో వాహనాన్ని ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  శశికళ ఫ్యామిలీ టార్గెట్: కరుణానిధి ఇంటిలో ఎందుకు ఐటీ దాడులు చెయ్యలేదు, బీజేపీ ఎంపీ!

  పుహళేంది అపార్ట్ మెంట్ ఎదురుగా సెల్లార్ లో ఉన్న టాటా సుమో వాహనంలో రూ. కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు, దస్రాలను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో టాటా సుమో వాహనం ఉపయోగించుకోవడానికి అక్కడ పార్క్ చెయ్యాలని యజమాని పూహళేంది చెప్పారని ఆయన డ్రైవర్ ఆదాయ పన్ను శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. రెండాకుల చిహ్నం శశికళ వర్గానికి ఇవ్వాలని ఢిల్లీలోని ఎన్నికల కమిషన్ ముందు పూహళేంది వాదిస్తున్నాడు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The Income Tax department raids on various properties linked to Sasikalaand Dinakaran family continued on Friday for the second consecutive day.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి