వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్‌లో తీపి కబురు ఛాన్స్: ఆదాయ పన్ను సర్దుబాటు, మళ్లీ తెరపైకి స్టాండర్డ్ డిడక్షన్

|
Google Oneindia TeluguNews

Recommended Video

Budget 2018 : రేపే బడ్జెట్: అధిక నిధులు కావాలన్న హోంశాఖ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం 2018-19 బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఈ బడ్జెట్ కోసం అందరూ కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆదాయపన్నులో సర్దుబాట్లు ఉంటాయని అందరు భావిస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు ఈ ఊరటను కోరుకుంటున్నారు.

వ్యక్తిగత ఆదాయపన్ను స్లాబ్‌లు, రేట్లును కేంద్రం ఈసారి సర్దుబాటు చేయవచ్చునని భావిస్తున్నారు. వేతన జీవులకు ఊరట కలిగించేలా ఈ బడ్జెట్ ఉంటుందనుకుంటున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ ఉంటే వేతన జీవులకు పన్ను భారం తగ్గుతుందని ఎక్కువ మంది భావిస్తున్నారు.

గత కొన్నేళ్లుగా స్లాబుల్లో మార్పుల్లేవు

గత కొన్నేళ్లుగా స్లాబుల్లో మార్పుల్లేవు

కొన్నేళ్లుగా ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేయలేదు. గత బడ్జెట్‌లో కూడా పన్ను మినహాయింపు పరిధిని పెంచకుండా కేవలం కొన్ని ఊరటలు మాత్రమే ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2018-19 బడ్జెట్‌లో పన్ను మినహాయింపు పరిధిని పెంచవచ్చని అంచనా వేస్తున్నారు.

తెలంగాణకు ఇప్పటి వరకు తోడ్పాటు లేదు: కేసీఆర్ ఏం అడిగారు, ఏం ఇచ్చారు?తెలంగాణకు ఇప్పటి వరకు తోడ్పాటు లేదు: కేసీఆర్ ఏం అడిగారు, ఏం ఇచ్చారు?

మధ్య తరగతికి తీపి కబురు

మధ్య తరగతికి తీపి కబురు

కొత్తగా వచ్చే పన్ను మినహాయింపు పరిధి కూడా రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో జైట్లీ మధ్య తరగతి వర్గాలకు తీపి కబురును చెబుతారనే ఆశాభావం సర్వత్రా వ్యక్తమవుతోంది.

బడ్జెట్‌పై ఏపీ 'ప్రత్యేక' ఆసక్తి: అందుకే బాబు ఆశ, ఆ మనస్తత్వం ఉంటే.. యనమల చురకబడ్జెట్‌పై ఏపీ 'ప్రత్యేక' ఆసక్తి: అందుకే బాబు ఆశ, ఆ మనస్తత్వం ఉంటే.. యనమల చురక

మళ్లీ తెరపైకి స్టాండర్డ్ డిడక్షన్

మళ్లీ తెరపైకి స్టాండర్డ్ డిడక్షన్

వివిధ రకాల మినహాయింపులకు బదులు స్టాండర్డ్‌ డిడక్షన్‌ను తీసుకొస్తారని చాలామంది భావిస్తున్నారు. గతంలో ఉండే ఈ మినహాయింపును మళ్లీ తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ఛాంబర్‌ఆఫ్‌ కామర్స్‌కు ఈ మినహాయింపును ఇవ్వాలని కోరుతోంది.

బడ్జెట్: వ్యక్తిగత పన్ను రాయితీ నుంచి.. ఏఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటేబడ్జెట్: వ్యక్తిగత పన్ను రాయితీ నుంచి.. ఏఏ రంగాలు ఏం ఆశిస్తున్నాయంటే

మినహాయింపు స్లాబును పెంచవచ్చు

మినహాయింపు స్లాబును పెంచవచ్చు

ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచేందుకు పన్ను మినహాయింపు స్లాబును పెంచుతారని భావిస్తున్నారు. కనీస మినహాయింపు పరిధిని రూ. 3లక్షలు చేయవచ్చు. రూ.50,000 వరకు వైద్య ఖర్చులపై మినహాయింపు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇవీ ఇచ్చే అవకాశాలు

ఇవీ ఇచ్చే అవకాశాలు

సెక్షన్ 80సి కింద ఇచ్చే పన్ను మినహాయింపులను పెంచే అవకాశాలు ఉన్నాయి. అయిదేళ్ల డిపాజిట్లపై ఇచ్చే మినహాయింపును మరింత సరళతరం చేస్తూ మూడేళ్ల డిపాజిట్లకు కూడా ఇవ్వవచ్చు. దేశీయ కంపెనీలు షేర్‌ హోల్డర్లకు చెల్లించే డెవిడెండ్‌ పైన విధించే పన్నును తగ్గించే అవకాశముందని భావిస్తున్నారు.

మరిన్ని నగరాలకు అత్యధిక రాయితీ

మరిన్ని నగరాలకు అత్యధిక రాయితీ


ప్రస్తుతం ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, ముంబై నగరాల్లో నివసించే వారికి లభించే ఇంటి అద్దె చెల్లిపుపై అత్యధిక రాయితీ లభిస్తోంది. దీంతో ఈసారి అత్యధిక రాయితీ వర్తించే నగరాల సంఖ్యను మరింత పెంచవచ్చు.

ఉద్యోగికి ఊరట

ఉద్యోగికి ఊరట


నోటీసు సమయం కంటే ముందే ఉద్యోగానికి రాజీనామా చేసే సమయంలో ఉద్యోగి.. ఓనర్‌కు చెల్లించే మొత్తానికి పన్ను మినహాయింపును ఇచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఉద్యోగి వాస్తవంగా అందుకున్న జీతానికి మాత్రమే పన్ను విధించే అవకాశముంది.

2017-18 ఆదాయపన్ను ఇలా

2017-18 ఆదాయపన్ను ఇలా

2017-18 ఏడాదికి ఆదాయపన్ను 60 ఏళ్ళ వయస్సు వరకు.. రూ.2.5 లక్షలకు ట్యాక్స్ లేదు. రూ.2,50,001-రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షలకు పైగా 30 సాతంగా ఉంది. 60-80 ఏళ్ల వయస్సు మధ్య గల వారికి రూ.3 లక్షల వరకు ట్యాక్స్ లేదు. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం, రూ.5 లక్షల నుంచి 10 లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షలకు పైగా 30 శాతంగా ఉంది. 80 ఏళ్లకు పైన ఉన్న వారికి రూ.5 లక్షల వరకు ట్యాక్స్ లేదు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షలకు పైగా 30 శాతం ఉంది.

English summary
In Budget 2018, Finance Minister Arun Jaitley is expected to announce some income tax relief for the middle class. The government may tweak income tax slabs and rates to bring down the burden on individuals, according to a survey by tax and advisory firm EY. Standard deduction for salaried individuals could make a comeback: The government may bring in standard deduction in Budget 2018 to reduce the tax burden of salaried individuals, according to majority of respondents in a pre-Budget survey by EY. Standard deduction allows for a flat deduction from income of a salaried individual towards expenses an employee would incur in relation to his or her employment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X