పెరోల్ మీద వచ్చి చక్రం తిప్పిన శశికళ, ఐదోరోజూ ఐటీ శాఖ సోదాలు, జయ టీవీ, కృష్ణప్రియ ఇళ్లు!
చెన్నై: తమిళనాడులో చిన్నమ్మ శశికళ ప్యామిలీపై జరుగుతున్న ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు ఐదో రోజు (సోమవారం) కొనసాగుతున్నాయి. శశికళ కుటుంబ సభ్యుల అక్రమాస్తులు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు షాక్ కు గురైనారు.
శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్, ఇళవరసి కుమారుడు వివేక్, ఆమె కుమార్తె కృష్ణప్రియ ఇళ్లు, చిన్నమ్మ సోదరుడు దివాకరన్ ఇళ్లు, కార్యాలయం, విద్యాసంస్థలు, జయ టీవీ. నమదు ఎంజీఆర్ దినపత్రిక కార్యాలయంతో పాటు పలు ప్రాంతాల్లో ఆదాయపన్నుశాఖ సోదాలు జరుగుతున్నాయి.

భర్త నటరాజన్ అనారోగ్యంతో ఉన్నారని ఇటీవల శశికళ ఐదు రోజులు పెరోల్ మీద బయటకు వచ్చిన విషయం తెలిసిందే. శశికళ ఆమె భర్త నటరాజన్ ను మూడు రోజుల్లో కొన్ని గంటలు మాత్రమే పరామర్శించి తరువాత మేనకోడలు కృష్ణప్రియ ఇంటిలో మకాం వేశారు.
ఆసందర్బంలో శశికళ తన స్థిరాస్తుల విషయంలో కృష్ణప్రియ, వివేక్, టీటీవీ దినకరన్ తదితరులతో చర్చించారని, నగదు లావాదేవీలు నిర్వహించారని గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. టీటీవీ దినకరన్, వివేక్, కృష్ణప్రియ తదితర ఎనిమిది మంది మీద ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐకి ఫిర్యాదు చెయ్యాలని ఆదాయపన్ను శాఖ అధికారులు నిర్ణయించారని తెలిసింది.












Click it and Unblock the Notifications