హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరోనా దెబ్బ : ఆ ఎఫెక్ట్ కూడా.. ఇప్పటికే మొదటి వేవ్‌లోకి.. రాహుల్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ నియంత్రణ విషయంలో మొదటి నుంచి కేంద్రాన్ని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తాజాగా మరోసారి పలు సలహాలు,సూచనలు చేశారు. కరోనా వైరస్‌ను నిర్మూలించాలంటే లాక్ డౌన్ మాత్రమే సరిపోదన్నారు. లాక్ డౌన్ అనేది పజ్ బటన్‌ లాంటిదని.. దాని ద్వారా కొంతకాలం మాత్రమే వైరస్‌ను నియంత్రించగలమని అన్నారు.

Recommended Video

Lockdown Not A Solution To Defeat COVID-19: Rahul Gandhi

క్షేత్రస్థాయిలో టెస్టుల సంఖ్యను పెంచడం.. పాజిటివ్ కేసులను గుర్తించడంలో దూకుడుగా,వ్యూహాత్మకంగా వ్యవహరించడమే కరోనాపై యుద్దానికి ఏకైక మార్గమన్నారు. ఇదే కేంద్రానికి తాను ఇచ్చే సలహా అని చెప్పారు. ఓ వీడియో యాప్ ద్వారా రాహుల్ గాంధీ గురువారం(ఏప్రిల్ 16) మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం దేశంలో చాలా నెమ్మదిగా టెస్టులు జరుగుతున్నాయని.. ఇకనైనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని సూచించారు. వీలైనంత ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించడం.. రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో ఆర్థికంగానూ సమాయత్తం కావాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు నిందలు మోపుకునే బ్లేమ్ గేమ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. దానికి బదులు ఉన్న వనరులను సమగ్రంగా వినియోగించుకుంటూ రాష్ట్రాలకు ఆర్థిక సాయం చేయాలన్నారు.

increasing Testing Only Solution to Defeat Coronavirus, Rahul Gandhi

దేశానికి భారీ ఆర్థిక సంక్షోభం తప్పదని.. ఇప్పటికే నిరుద్యోగం రూపంలో దాని తాలుకు మొదటి వేవ్ మొదలవుతోందని అన్నారు. అటు ప్రజల ప్రాణాలను కాపాడుతూనే.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాలతో ప్రధాని మరింతగా సంప్రదింపులు జరపాలన్నారు. అంతకుముందు బుధవారం పేదలకు ఎమర్జెన్సీ రేషన్ కార్డులను జారీ చేయాలని రాహుల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

English summary
increasing Testing Only Solution to Defeat Coronavirus, Rahul Gandhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X