సడన్‌గా ప్రధానమంత్రి సంగ్రహాలయాలో రోహిత్ శర్మ

రెండో టెస్ట్ లోనూ ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది టీమిండియా. తొలి టెస్ట్ తరహాలోనే ఈ మ్యాచ్ ను కూడా మూడురోజుల్లోనే ముగించేసింది. అనంతరం ఢిల్లీలోని ప్రధానమంత్రి సంగ్రహాలయాన్ని సందర్శించింది టీమ్.

న్యూఢిల్లీ: స్వదేశీ గడ్డపై భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలుత న్యూజిలాండ్, ఇప్పుడు ఆస్ట్రేలియన్ల దుమ్ము దులుపుతోంది టీమిండియా. గవాస్కర్-బోర్డర్ ట్రోఫీలో భాగంగా నాగ్ పూర్ లో జరిగిన తొలి టెస్ట్ లో కంగారూలను మడత పెట్టేసిన టీమిండియా ప్లేయర్లు- రెండో మ్యాచ్ లోనూ అదే రేంజ్ లో విజృంభించారు. ఈ రెండు మ్యాచ్ లను కూడా మూడు రోజుల్లోనే ముగించారు. నాలుగు టెస్ట్ మ్యాచ్ ల ఈ సిరీస్ లో 2-0 తేడాతో ఆధిక్యతలో నిలిచింది.

తొలి ఇన్నింగ్ లో..

తొలి ఇన్నింగ్ లో..


తొలి ఇన్నింగ్ లో ఆస్ట్రేలియాకు ధీటుగా రాణించింది టీమిండియా. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా-81, మిడిలార్డర్ బ్యాటర్ పీటర్ హ్యాండ్స్‌ కాంబ్- 72, లోయర్ ఆర్డర్ లో పాట్ కమ్మిన్స్- 33 పరుగులు చేశారు. టీమిండియాలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లతో ఆస్ట్రేలియా నడ్డి విరిచాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడు చొప్పున వికెట్లు పడగొట్టారు.

ధీటుగా..

ధీటుగా..

దీనికి ప్రతిగా తన తొలి ఇన్నింగ్ లో భారత్ 262 పరుగులు చేసింది. రోహిత్ శర్మ-32, విరాట్ కోహ్లీ-44, రవీంద్ర జడేజా- 25, రవిచంద్రన్ అశ్విన్- 37 పరుగులు చేశారు. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 74 పరుగులతో జట్టును ఆదుకున్నాడు. ఆసీస్ ఏస్ స్పిన్నర్ నాథన్ లియాన్ అయిదు వికెట్లు నేలకూల్చాడు. టాడ్ మర్ఫీ, మాథ్యు కుహ్మెన్ మన్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.

సెకెండ్ ఇన్నింగ్ లో నిప్పులు..

సెకెండ్ ఇన్నింగ్ లో నిప్పులు..

రెండో ఇన్నింగ్ లో టీమిండియా బౌలర్లు అసలు సిసలు మజా చూపారు. ఆస్ట్రేలియాను 113 పరుగులకు కట్టడి చేశారు. ఓపెనర్ ట్రవిస్ హెడ్-43, మార్ముస్ లాంబుషెన్-35 పరుగులు మినహా మరెవరూ డబుల్ డిజిట్ స్కోర్ కూడా చేయలేకపోయారు. ఉస్మాన్ ఖవాజా-6, స్టీవెన్ స్మిత్-9, మాథ్యూ రెన్‌షా- 2, పీటర్స్ హ్యాండ్స్ కాంబ్-0, అలెక్స్ క్యారీ-7, పాట్ కమ్మిన్స్-0, నాథన్ లియాన్-8, టాడ్ మర్ఫీ-3, మాథ్యూ కుహ్నెన్ మన్-0 పరుగులు చేశారు.

నాలుగు వికెట్లు కోల్పోయి..

నాలుగు వికెట్లు కోల్పోయి..


అనంతరం బ్యాటింగ్ కు దిగిన టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 118 పరుగులు చేసింది. కేప్టెన్ రోహిత్ శర్మ, చేతేశ్వర్ పుజారా 31 పరుగులు చొప్పున చేశారు. విరాట్ కోహ్లీ-20, శ్రేయాస్ అయ్యర్- 12, కోన శ్రీకర్ భరత్-23 పరుగులు చేశారు. ఈ రెండు దేశాల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ మార్చ్ 1వ తేదీన ఆరంభమౌతుంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

విజయం ఇచ్చిన ఊపుతో..

విజయం ఇచ్చిన ఊపుతో..

కాగా- టెస్ట్ మ్యాచ్ మూడోరోజే ముగిసిపోవడంతో టీమిండియా ప్లేయర్లు ఢిల్లీలో సరదాగా గడిపారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి సంగ్రహాలయాను సందర్శించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రుల స్మారకార్థం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజియం ఇది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత ఏడాది ఏప్రిల్ లో దీన్ని జాతికి అంకితం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+