Independence Day: వజ్సోత్సవాలు, ఐటీ హబ్ ప్రజలకు గుడ్ న్యూస్, సిటీ బస్సుల్లో ఫ్రీ !
బెంగళూరు: భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్బంగా వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు ఘంనగా నిర్వహించడానికి కేంద్ర, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ఆగస్టు 15వ తేదీన బెంగళూరు సిటీ బస్సుల్లో ప్రయాణికులు ఉచితంగా సంచరించడానికి అవకాశం చిక్కింది.
నిత్యం ఐటీ హబ్ బెంగళూరు నగరంలో లక్షల మంది బీఎంటీసీ బస్సుల్లో సంచరిస్తుంటారు. బెంగళూరులో ఉచితంగా సిటీ బస్సుల్లో సంచరించడానికి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రయాణికులు బెంగళూరు సిటీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సంచరించడానికి అవకాశం చిక్కింది.

బెంగళూరు నగరంలోని ప్రతినిత్యం సంచరించే ఓల్వో బస్సులు (ఏసీ బస్సులతో సహ అన్ని బీఎంటీసీ బస్సుల్లో ఆగస్టు 15వ తేదీన ఉచితంగా సంచరించడానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కర్ణాటక రవాణా శాఖ సంస్థ చైర్మన్ నందీష్ రెడ్డి మీడియాకు చెప్పారు.
బీఎంటీసీ బస్సుల ద్వారా ప్రతిరోజు రూ. 3 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆధాయం వస్తుందని నందీష్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం వజ్రోత్సవాల సందర్బంగా బస్సుల్లో ప్రయాణికులు ఉచితంగా సంచరించినా ఆ రూ. 3 కోట్ల భారం ప్రభుత్వం భరించడానికి సిద్దం అయ్యిందని నందీష్ రెడ్డి అన్నారు. అదే రోజు 12 మీటర్ల పొడవు ఉన్న 300 ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు అంకితం చేస్తామని నందీష్ రెడ్డి మీడియాకు చెప్పారు. ఇప్పటికే బెంగళూరులో 9 మీటర్ల పొడవు ఉన్న మినీ ఎలక్ట్రిక్ బస్సులు సంచరిస్తున్నాయి.












Click it and Unblock the Notifications