'రాజకీయాలంటే ప్రజలను ఫూల్స్ చేసి.. డబ్బు సంపాదించడానికే'
ప్రధాని మోడీని సైతం చౌదరిని వదల్లేదు. ప్రజలను పిచ్చోళ్లను చేసి.. ఓ వ్యక్తి దేశాన్ని ఏలుతున్నప్పుడు.. తానెందుకు అలా చేయకూడదని ప్రశ్నించారు.
లక్నో: ఇప్పటి రాజకీయ నాయకులకు ప్రజలు.. ప్రజాస్వామ్యం అంటే ఎంత చిన్నచూపో.. ఈ బరితెగించిన వ్యాఖ్యలు చూస్తే అర్థమైపోతుంది. ఎన్నికలను మార్కెట్‌లా.. ప్రజలను అందులో వస్తువుల్లా భావిస్తూ.. కేవలం డబ్బు వెనకేసుకోవడం కోసమే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నవారు చాలామంది ఉన్నారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వతంత్ర అభ్యర్థి గోపాల్ చౌదరి కూడా ఇదే కోవలోకి వస్తాడు. ఆగ్రా నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న చౌదరి ఎన్నికల ప్రచారంలో నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాడు. డబ్బు కోసమే రాజకీయాల్లోకి వస్తున్నానని బహిరంగంగానే ప్రకటించుకుంటున్నాడు.
#WATCH: Independent candidate Agra South Gopal Chaudhary says 'my only reason for coming into politics is money, I'll fool people" pic.twitter.com/sYfPIdhiYC
— ANI UP (@ANINewsUP) January 27, 2017
ప్రజలను ఫూల్స్ ను చేసి సంపాదించుకోవడానికే రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నా.. అంటూ ఎన్నికల ప్రచారలంలో చౌదరి చెప్తున్నాడు. ఆ వ్యాఖ్యలను సమర్థించుకుంటూ.. తానొక్కడినే కాదని, దాదాపు రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ ఒక్కరు పరోక్షంగా అదే ఉద్దేశ్యంతో వస్తారని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రధాని మోడీని సైతం చౌదరిని వదల్లేదు. ప్రజలను పిచ్చోళ్లను చేసి.. ఓ వ్యక్తి దేశాన్ని ఏలుతున్నప్పుడు.. తానెందుకు అలా చేయకూడదని ప్రశ్నించారు. 'నేను కూడా ఆయన అడుగు జాడల్లోనే నడుస్తున్నాను'.. అని పేర్కొంటూ పరోక్షంగా మోడీపై విమర్శలు గుప్పించారు. ప్రజలను ఫూల్స్ చేసి ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. దానికి కొంత టాలెంట్ ఉండాలని చౌదరి వ్యాఖ్యానించడం కొసమెరుపు.












Click it and Unblock the Notifications