ఆందోళన కలిగే అంశం: భారత్‌ను దాటేసిన ఉత్తరకొరియా

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఓ వైపు ప్రపంచ దేశాల్లో శర వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ముందు వరుసలో ఉంది మనదేశం. అయినా, ఇప్పటికీ భారత్‌లో ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విడుదలైన ప్రపంచ ఆకలి సూచీలో ఉన్న 119 దేశాల్లో భారత్‌ 100వ ర్యాంకులో నిలిచింది. ఈ సూచి ప్రకారం గమనించినట్లయితే భారత్‌.. ఉత్తర కొరియా, శ్రీలంక, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉండటం విచారకరం.

గురువారం అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ(ఇంటర్నేషనల్‌ ఫుడ్‌ పాలసీ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) ఈ మేరకు ప్రపంచ ఆకలి సూచి పట్టికను విడుదల చేసింది. ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువగా పోషకాహారం లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా ఆ నివేదిక వెల్లడించింది.

 India 100th on global hunger index, trails North Korea, Bangladesh

21శాతం ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికహారలోపంతో బాధపడుతుండటంతోపాటు సరైన బరువు కూడా లేరని పేర్కొంది. 2016లో 118 దేశాల్లో భారత్‌ది 97 ర్యాంకుకాగా, ఈ ఏడాది మాత్రం శ్రీలంక, బంగ్లాదేశ్‌లు భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి.

ఇక ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్న ఉత్తర కొరియా కూడా గత ఏడాది కూడా భారత్‌ కంటే కింద ఉండి.. ఈ ఏడాది మాత్రం ఏకంగా 93 ర్యాంకుకు సాధించింది. అయితే, గతంలో మాదిరిగానే పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌లు మాత్రం భారత్‌ వెనుకే ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ స్కోర్‌ 31.4గా ఉంది. ఈస్కోరు 28.5కి చేరితే మాత్రం తీవ్ర ఆందోళనకర అంశంగా పరిగణించాల్సిం ఉంటుంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
India has a “serious” hunger problem and ranks 100th out of 119 countries on the global hunger index — behind North Korea, Bangladesh and Iraq but ahead of Pakistan, according to a report.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి