భారత్ లో ఉన్న 7 సీక్రెట్ గోల్డ్ మైన్స్ ఇవే.. షాకింగ్ విషయాలు వెలుగులోకి..!
భారతీయులకు బంగారం అంటే ఓ ఎమోషన్ అన్న విషయం తెలిసిందే.. పెళ్లి అయినా మరే ఫంక్షన్ అయినా ముందుగా బంగారం కొనేస్తుంటారు. ఓ శుభకార్యానికి వెళ్లినా ఒంటి నిండా నగలతో వెళ్లాలని చాలామంది మహిళలు కలలు కంటూ ఉంటారు. కానీ దేశంలో బంగారం ధరలు చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ. 1,45,000 పైగానే ఉంది. దాంతో ఈ రోజుల్లో బంగారం కొనాలంటేనే వామ్మో అని బెంబెలెత్తిపోయే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా బంగారానికి విపరీతంగా డిమాండ్ పెరిగిపోయిన నేపథ్యంలో భారత్ లోని 7 సీక్రెట్ గోల్డ్ మైన్స్ గురించి మీకు తెలుసా..? ఈ రహస్య బంగారు గనుల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కర్ణాటక) ఇది భారత్ లోని పురాతనమైన బంగారు గనిగా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇది దేశంలోనే లోతైన బంగారు గని. బ్రిటిష్ పాలనలో 1880 లో ఈ గని ప్రారంభం అయింది. పర్యావరణ, ఆర్థిక కారణాల వల్ల 2001 లో ఈ గని మూతపడింది. అప్పటివరకు ఈ గని దాదాపు 800 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఇక కర్ణాటకలోనే హట్టి గోల్డ్ మైన్స్ కూడా ఉన్నాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఇది ఉంది. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ లో ఉన్న ఏకైన బంగారం గని ఇదే. ఈ గనికి 2వేలకు పైగా చరిత్ర ఉంది. ఇది ప్రతి సంవత్సరం సుమారు 1.8 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది.
అలాగే ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర గోల్డ్ మైన్స్.. 2020 లో ఇక్కడ భారీగా బంగారం నిక్షేపాలు బయటపడినప్పుడు ఇది దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. జియోలాజికల్ నిపుణుల అంచనా ప్రకారం.. ఇక్కడ వివిధ ప్రాంతాల్లో దాదాపు 700 టన్నుల బంగారు ఖనిజం ఉంది. అలాగే బంగారంతో పాటు ఇక్కడ వెండి, రాగి, ఇనుము నిక్షేపాలు కూడా ఉన్నాయి. కర్ణాటకలోని గనజూర్ గోల్డ్ మైన్.. ఇది ప్రముఖ మైనింగ్ ప్రాజెక్ట్ గా మారాల్సి ఉంది. డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థ ఇక్కడ వాణిజ్యపరమైన ఉత్పత్తిని ప్రారంభించాలని భావించింది. కానీ దీని మైనింగ్ లీజును ప్రభుత్వం తిరస్కరించింది.

జొన్నగిరి గోల్డ్ మైన్.. ఇది కర్నూలు జిల్లాలో ఏపీ- తెలంగాణ సరిహద్దు దగ్గరలో ఉంది. ఇది భారత్ లోని మొదటి ప్రైవేట్ ఓపెన్ పిట్ బంగారు గనిగా మారబోతుంది. దీనిని కూడా డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థ మద్దతుతో అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఏడాదికి దాదాపు 1.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని అంచనా.. అలాగే జార్ఖండ్ లోని లావా గోల్డ్ మైన్.. ఏపీ, అనంతపురం జిల్లాలోని రామగిరి గోల్డ్ మైన్ కూడా ఉంది. బ్రిటిష్ కాలంలో 1905 నుంచి 1927 మధ్య ఇక్కడ మైనింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో బంగారంతోపాటు రాగి, సీసం, జింక్ నిక్షేపాలు కూడా ఉన్నాయని నమ్ముతారు.












Click it and Unblock the Notifications