ఉప ఎన్నిక కోసం ఒక్కటైన విపక్షాల కూటమి..బీజేపీకి జలక్ ఇస్తారా..?

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఘోసి అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థికి ఇండియా కూటమి పార్టీలు మద్దతుగా నిలిచాయి. ఘోసి నియోజకవర్గం ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్ష కూటమి... ఇక్కడ గెలిచి లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి నియోజకవర్గానికి సెప్టెంబర్ 5న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లను సెప్టెంబర్ 8న లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.ఘోసి నియోజకవర్గం అభ్యర్థిగా సుధాకర్ సింగ్‌ను సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. ఆయనకు మద్దతుగా, "భారత్" సంకీర్ణ పార్టీలు, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ మరియు అప్నా దళ్(కె) అభ్యర్థులను నిలబెట్టకుండా తమ మద్దతును తెలిపాయి.

INDIA alliance decides to support samajwadi party candidate for the upcoming Koshi by election

ఇక ఇండియా కూటమి విషయానికొస్తే.. లోక్‌సభ ఎన్నికల్లో ఇదే ఫార్ములాను పాటించాలని భావిస్తున్నాయి. అంటే కూటమి నుంచి ఒక అభ్యర్థిని నిలబెట్టి మిగతా పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఘోసి నియోజకవర్గంలో నిలబడుతున్న సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి కూటమిలోని పలు పార్టీలు తమ మద్దతు ఉంటుందని అధికారికంగా లేఖలు రాశాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ రాయ్ అన్నారు. యూపీలో అధికార బీజేపీపై ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కాబట్టి విపక్షాల కూటమి సమాజ్ వాదీ అభ్యర్థికి ఏకగ్రీవంగా మద్దతు పలుకుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

2022లో ఘోసి నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దారాసింగ్ చౌహాన్ విజయం సాధించారు. అయితే తాను తన పదవికి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఈ నియోజకవర్గం ఉపఎన్నిక ఎదుర్కొంటోంది. ఇక బీజేపీ అభ్యర్థిగా దారాసింగ్ చౌహాన్ పోటీచేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ అభ్యర్థి ఓటమికి విపక్షాల కూటమి కృషిచేస్తోంది. ఇందులో భాగంగానే సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థికి అండగా నిలుస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+