India Global Week 2020: ప్రపంచం మనవైపే చూస్తోంది, భారత్ ఆర్థిక స్థితి మెరుగవుతోంది: మోడీ

న్యూఢిల్లీ: భారతీయులు సహజ సిద్ధంగా సంస్కరణల కర్తలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చరిత్ర ఇదే చెబుతోందని అన్నారు. గతంలో ఎన్నో సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపారు. గురువారం జరిగిన ఇండియా గ్లోబల్ వీక్-2020 సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సదస్సు భారత్-యూకే మధ్య గల సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Recommended Video

    India Global Week 2020: PM Modi Speech కరోనా తరువాత భారత్ అగ్రగామిగా మారుతుంది..!! | Oneindia Telugu

    వచ్చే ఏడాది వింబుల్డన్ సెంట్రల్ కోర్టులో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. భారత్ ఓ శక్తి కర్మాగారమని అన్నారు. డాక్టర్లు, కార్మికులు, హెల్త్ వర్కర్లు, సాఫ్ట్ వేర్ నిపుణులు, ఇంజినీర్లు వంటి మేధవులను ప్రపంచం ఎప్పటికీ విస్మరించలేదని అన్నారు.

    India already seeing green shoots of economic recovery: PM Modi in India Global Week 2020

    భారత్ అన్ని రంగాల్లో పునరుజ్జీవనం పొందడానికి ఇదో చక్కని అవకాశమని ప్రధాని మోడీ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వంటి అనేక ప్రాజెక్లులు ఆర్థిక రంగం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక రంగాల్లో భారత్‌ను పురోగమింపజేస్తున్నాయని అన్నారు.

    కరోనా అన్‌లాక్ అనంతరం దేశవ్యాప్తంగా వేలాదిమంది వలస కార్మికులకు ఉపాధిని కల్పించబోతున్నామని, . గ్రామీణరంగానికి ఊతమిచ్చేలా చర్యలను తీసుకోబోతున్నామన్నారు. గ్రామీణ ఆర్థిక రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ ఇప్పటికే ఆర్థికంగా మంచి ఫలితాలను కనబరుస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

    ఎంఎస్ఎంఈ రంగంలో అనేక సంస్కరణలను తీసుకుని వస్తున్నామని, పెట్టుబడిదారుల కోసం ద్వారాలు తెరిచి ఉంచామని తెలిపారు. ప్రజలను డిజిటల్ రూపంలో స్వయం ప్రతిపత్తిని కల్పించబోతున్నామని ప్రధాని మోడీ వివరించారు.

    ప్రపంచవ్యాప్తంగా భారత ఫార్మా రంగం అగ్రగామిగా కొనసాగుతోంది. కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కోసం ఫార్మారంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో మూడోవంతు దేశాలకు అవసరమైన మందులను సరఫరా చేసే స్థాయికి భారత్ చేరుకుందని ప్రధాని మోడీ తెలిపారు.

    కరోనా వల్ల నెలకొన్న సంక్షోభ పరిస్థితులను అవకాశంగా మలచుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తున్నాం. ఈ మహమ్మారి వల్ల నెలకొన్న సంక్లిష్ఠ పరిస్థితుల తరువాత భారత్ అగ్రగామిగా మారుతుందని ఆశిస్తున్నామని ప్రధాని మోడీ చెప్పారు.

    నమస్తే.. అనే పదం గ్లోబల్ ఇమేజ్‌గా మారింది. భారత సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయి. ప్రస్తుతం భారత్ సంస్కరణల పథంలో ప్రయాణిస్తోంది. మానవతా దృక్పథంతో కూడిన సంస్కరణలను ప్రారంభించిందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

    అభివృద్ధి పథంలో ప్రయాణిస్తోన్న భారత్‌లో పర్యావరణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు ప్రధాని మోడీ. రోనా వల్ల ఏర్పడిన ప్రస్తుత పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నామని, ప్రతి రూపాయిని నేరుగా పేదల అకౌంట్‌లోకి చేరేలా చర్యలు చేపట్టామని ప్రధాని మోడీ వివరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+