ఎగ్టిట్ పోల్స్ వేళ ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ - ప్రధాని అభ్యర్ధిపై తేల్చే ఛాన్స్..!
లోక్ సభ ఎన్నికల తుది దశ పోలింగ్ ఇవాళ పూర్తి కానుంది. సాయంత్రం సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడనున్నాయి. ఇప్పటికే పూర్తయిన ఆరు దశల ఎన్నికల్లో అధికార ఎన్డీయేకూ, విపక్ష ఇండియా కూటమికీ మధ్య హోరాహోరీ పోరు జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో ఇండియా కూటమి నేతలు కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో భేటీ అయ్యారు.

#WATCH | INDIA alliance meeting underway at the residence of Congress President Congress President Mallikarjun Kharge, in Delhi.
— ANI (@ANI) June 1, 2024
(Source: Twitter handle of Congress) pic.twitter.com/wxtXmU9Ih0
ఇండియా కూటమి నేతల భేటీలో మల్లిఖార్జున ఖర్గే తో పాటు సోనియా గాంధీ, కేజ్రివాల్, భగవంత్ మాన్, డి రాజా, శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, చంపై సోరెన్ వంటి నేతలు హాజరయ్యారు. ఇవాళ జరుగుతున్న లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో కమ్యూనిస్టులతో తలపడుతున్నందున ఓటర్లకు తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే కారణంతో మమతా బెనర్జీ ఈ భేటీకి హాజరు కావట్లేదని ముందే చెప్పేశారు.
మరోవైపు ఇవాళ జరిగే ఇండియా కూటమి భేటీలో ఆయా పార్టీల విజయావకాశాలపై నేతలు చర్చించబోతున్నారు. ఇప్పటికే యోగీంద్ర యాదవ్ తో పాటు పలువురు సెఫాలజిస్టులు ఇండియా కూటమి మెరుగైన సీట్లు సాధించబోతోందని జోస్యాలు చెప్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అలాగే ఇండియా కూటమి తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరనే దాన్ని 48 గంటల్లో తేల్చేస్తామని రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేసారు. దీంతో ప్రధాని అభ్యర్ధి ఎంపిక కూడా ఇవాళ జరిగే అవకాశముంది. ఇప్పటికే తన ప్రధాని అభ్యర్ధి ఛాయిస్ రాహుల్ గాంధీయేనని ఖర్గే ప్రకటించారు.












Click it and Unblock the Notifications