కూటమి సర్కార్‌కు తొలి అగ్నిపరీక్ష
Jagdeep Dhankhar vs Jaya Bachchan: ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా.. అవిశ్వాస తీర్మానానికి సన్నద్ధమౌతోంది. రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్‌పై అవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. దీనికోసం ఎన్డీయేతర పార్టీల మద్దతును కూడగట్టుకుంటోంది.
రాజ్యసభలో జగ్‌దీప్ ధన్‌కర్- సమాజ్‌వాది పార్టీ సభ్యురాలు జయా బచ్చన్ మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం దీనికి కారణమైంది. అలాగే- ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గేపై భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఘనశ్యామ్ తివారీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు విషయంపైనా చర్చించడానికి ఛైర్మన్ అంగీకరించకపోవడం కూడా దీనికి దారి తీసింది.

ఇప్పటికే జగ్‌దీప్ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి ఇప్పటికే 50 నుంచి 80 మంది వరకు విపక్ష పార్టీల సభ్యులు అంగీకారం వ్యక్తం చేశారని, దీనికి సంబంధించిన నోటీసుపై వాళ్లందరూ సంతకాలు చేశారని ఇండియా కూటమి నాయకులు చెబుతున్నారు.
సంతకాలను సేకరిస్తోన్న సమయంలోనే పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ముగియడం వల్ల ఈ నోటీసును అందజేసే అవకాశం లభించలేదని స్పష్టం చేశారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై ముందుకు వెళ్లాలా? వద్దా? అనే విషయంపై త్వరలో భాగస్వామ్య పార్టీల నాయకులతో సమావేశాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 67 (బి) ప్రకారం ఈ నోటీసును ఇవ్వదలిచినట్లు కాంగ్రెస్ ఎంపీ ఒకరు తెలియజేశారు. నిష్ఫక్షపాతంగా సభను నడిపించాల్సిన ఛైర్మన్.. అధికార కూటమికి మద్దతుగా నిలిచారని, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గేను మాట్లడటానికి అనుమతి ఇవ్వకపోవడం, పదేపదే మైక్ కట్ చేయడం సరికాదని కాంగ్రెస్ ఎంపీలు అజయ్ మాకెన్, ప్రమోద్ తివారీ విమర్శించారు.
జగ్‌దీప్ ధన్‌కర్‌పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని వాళ్లు ఆరోపించారు. రాజ్యసభ అనేది ఒక పార్టీకి సంబంధించినది కాదని హితవు పలికారు. మల్లికార్జున్ ఖర్గేను ఉద్దేశించి బీజేపీ ఎంపీ ఘనశ్యామ్ తివారీ అవమానకరంగా మాట్లాడారని, దానిపై ఛైర్మన్ నుంచి సరైన సమాధానం రాలేదని అన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications