Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్ కుల సర్వేతో విపక్షాల సక్సెస్! ఆత్మరక్షణలో ఎన్డీయే ! దేశాన్ని చీల్చేందుకేనన్న ప్రధాని..

విపక్ష ఇండియా కూటమి అధికారంలో ఉన్న బీహార్ లో తాజాగా నిర్వహించిన కులాల సర్వే ఫలితాలు నిన్న వెల్లడయ్యాయి. ఇందులో బీహార్ జనాభాలో 63 శాతం మంది బీసీలు ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లోనూ ఈ సర్వే కోసం ఒత్తిడి మొదలు కాబోతోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న ఎన్డీయే కూటమి ఈ సర్వే ఫలితాలతో పూర్తిగా ఆత్మరక్షణలోకి పడిపోయింది. ప్రధాని మోడీ దీనిపై పరోక్షంగా స్పందిస్తూ విపక్షం దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

బీహార్ లో ఇండియా కూటమి ప్రభుత్వం విజయవంతంగా కుల గణనను పూర్తి చేయడమే కాకుండా కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు వీటి ఫలితాల్ని కూడా విడుదల చేసింది. ఎన్నో అడ్డంకుల్ని దాటుకుని, న్యాయస్ధానాల్లో అనుమతులు తెచ్చుకుని మరీ ఈ సర్వే చేపట్టడమే కాకుండా పూర్తి చేయడం విపక్షాలకు భారీ విజయం కాబోతోంది. బీహార్ ప్రభుత్వం విడుదల చేసిన కుల సర్వే ఫలితాల్లో బీసీల జనాభా ఏకంగా 63 శాతం ఉందని తేలడంతో ఇప్పుడు ఇదే అంశాన్ని జాతీయ స్ధాయిలో ఫోకస్ చేసేందుకు ఇండియా కూటమి సిద్దమవుతోంది.

INDIA bloc put NDA into defence with bihar caste survey, pm modi says trying to divide people

అంతటితో ఆగని నితీశ్ కుమార్ సర్కార్ ఇవాళ బీహార్లో అఖిలపక్ష భేటీ నిర్వహిస్తోంది. కులాల సర్వే ఫలితాలపై చర్చించేందుకు రావాలని విపక్షాల్ని ఈ భేటీకి ఆహ్వానించింది. తద్వారా ఎన్డీయేను మరింత ఇరుకునపెట్టేందుకు సిద్దమైంది. ఇవాళ నితీశ్ నిర్వహిస్తున్న భేటీకి వెళ్తే ఓ సమస్య, వెళ్లకపోతే మరో సమస్య అన్నట్లుగా బీహార్ లో బీజేపీ పరిస్ధితి తయారైంది. దీంతో బీజేపీని ఎన్నికలకు ముందు ఇండియా కూటమి పెద్దదెబ్బ తీసినట్లు అర్ధమవుతోంది. ఇవాళ అఖిలపక్ష భేటీలో నితీశ్ సర్కార్ బీసీల జనాభా ఎక్కువ ఉందని తేలిన నేపథ్యంలో ఏదైనా ప్రకటన చేస్తే అది బీజేపీని మరింత ఇరుకునపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

బీహార్లో కుల గణన ఫలితాలు వెలువడటంతో ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఇలాంటి సర్వేలు చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తే అవకాశం ఉంది. దీంతో సహజంగానే అక్కడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెరగడం ఖాయం. కుల సర్వే చేయించేందుకు ఏపీలో వైసీపీ సర్కార్ తాజాగా నిర్ణయం తీసుకుంది. అయితే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు విపక్షాలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో కుల గణన ఉంటుందా లేదా అన్నది తేలలేదు. అయితే విపక్ష ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాత్రం జాతీయ స్ధాయిలో కుల గణనకు పట్టుబడుతున్నారు. దీంతో ఎన్డీయే కూటమి ఇరుకునపడుతోంది.

ప్రధాని మోడీ నిన్న బీహార్ కుల గణన ఫలితాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ విపక్షాలు దేశాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్ లో ప్రచారాన్ని వెళ్లిన సందర్భంగా ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయకుండా, ఇప్పుడు పేదల మనోభావాలతో విపక్షాలు ఆడుకుంటున్నాయని ప్రధాని మోడీ ఆరోపించారు. గతంలోనూ కులం పేరుతో దేశాన్ని విపక్షాలు విభజించాయని,మరోమారు అదే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+