Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియా బ్లాక్ బోల్డ్ మూవ్- ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రెడ్డి

Vice President of India: జగ్ దీప్ ధన్‌ఖర్ ఆకస్మిక రాజీనామా వల్ల ఖాళీ అయిన ఉప రాష్ట్రపతి స్థానాన్ని భర్తీ చేయడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. దీనికి సంబంధించిన తాజా ఉత్తర్వులను కేంద్ర ఎన్నికల కమిషన్ జారీ చేసింది. ఈ ప్రక్రియ మొదలు పెట్టినట్లు వెల్లడించింది.

ఆరోగ్య కారణాల దృష్ట్యా ధన్ ఖర్ కిందటి నెలలో తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి, వైద్యుల సలహా మేరకు రాజీనామా చేస్తున్నట్లు ఈ లేఖలో తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(ఏ) ప్రకారం వెంటనే తన రాజీనామా అమల్లోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

INDIA Bloc s Bold Move B Sudershan Reddy to Represent as Vice-Presidential Candidate

74 సంవత్సరాల ధన్‌ఖర్ 2022 ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం 2027 వరకు ఉంది. రాజ్యసభ ఛైర్మన్‌ కూడా అయిన ధన్‌ఖర్.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.

ఆయన రాజీనామాతో కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఉపరాష్ట్రపతి పదవికి సెప్టెంబర్ 9న ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది ఈసీ. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభమైంది.

నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ.. ఈ నెల 21. 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు 25లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. సెప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ ఉంటుంది. 21వ తేదీ లోపే ఎన్డీఏ- ఇండియా కూటములు తమ అభ్యర్థులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఇదివరకే భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి.. తమ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ ను ఎంపిక చేసింది. ఆయనను గెలిపించడానికి తనవంతు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఇతర నాయకులకు ఫోన్ చేసి మాట్లాడారు.

ఇప్పుడు తాజాగా- కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా బ్లాక్.. తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థి పేరును ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. తమ ఉమ్మడి అభ్యర్థిగా ఇండియా కూటమి ఆయన పేరును ప్రకటించింది.

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు బ్లాక్ నాయకులు. ఉభయ సభల మొత్తం బలం 786 కాగా, ఉపరాష్ట్రపతి ఎన్నికలో గెలుపునకు 394 ఓట్లు అవసరం. ఈ ఎన్నికల ప్రక్రియలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+