భద్రతా దళాల గొప్ప విజయం.. సజీవంగా పట్టుబడిన మరో కసబ్!
భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ అమిర్ సజీవంగా పట్టుబడ్డాడు. ఈ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు.
న్యూఢిల్లీ : భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ అమిర్ సజీవంగా పట్టుబడ్డాడు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని లష్కరే తొయిబా కుట్ర పన్నుతోందని ఈ ఉగ్రవాది చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఇతని బృందంలో నలుగురైదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అమిర్ పాకిస్తాన్‌లోని ముల్తాన్ ప్రాంతానికి చెందినవాడు.

ఈనెల 24న జమ్మూ కశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇతనిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని జమ్మూ-కశ్మీరులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు నిర్వహించడమే లక్ష్యంగా లష్కరే తొయిబా కుట్ర పన్నుతోందని అమిర్ వెల్లడించినట్లు సమాచారం.
లష్కరే తొయిబా ఉగ్రవాది, అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇటీవలే పాకిస్తాన్‌లో గృహ నిర్బంధం నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే అతను మాట్లాడుతూ భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోరాదని భద్రతా నిపుణులు చెబుతున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications