వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే భారత్-చైనా 12వ రౌండ్ సైనిక చర్చలు -సరిహద్దులో టెన్షన్ తగ్గేలా -బీజేపీ, లెఫ్ట పార్టీల మాటల యుద్ధం

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు మళ్లీ పెరిగిన నేపథ్యంలో రెండు దేశాలూ చర్చలకు సిద్ధమయ్యాయి. గతంలో తూర్పు లదాక్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్ సరిహద్దులో కవ్వింపులకు పాల్పడుతోన్న డ్రాగన్ సైన్యాలను నిలువరించే దిశగా భారత్ పక్కా అజెండాతో చర్చలకు వెళుతున్నది. ఇందుకు..

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

భారత్ చైనా సైనిక అధికారుల మధ్య 12వ రౌండ్ చర్చలు రేపు(శనివారం, జులై 31న) జరుగనున్నాయి. తూర్పు లదాక్ లో ఎల్ఏసీ వెంబడి చైనా వైపున్న మోల్డో వద్ద జరగనున్న ఈ చర్చలకు రెండు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ స్థాయి అధికారులు నేతృత్వం వహిస్తారు. ఉదయం 10.30కు చర్చలు ఆరంభమవుతాయని, తూర్పు లదాక్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా శిఖరాల నుంచి చైనా సైన్యాలు పూర్తిగా వెనుదిరిగేలా భారత్ ఒత్తిడి చేయనుందని సైనిక వర్గాలు తెలిపాయి.

 India, China 12th round military talks on July 31, BJP slams Left on Chinese embassy event

నిజానికి12వ రౌండ్ మిలటరీ చర్చలను ఈనెల 28నే జరుపుదామని చైనా కోరినా, కార్గిల్ విజయ్ దివస్ ఉండటంతో భారత్ తేదీని వాయిదా వేసింది. చివరికి ఈనెల 31న(శుక్రవారం) చర్చలు జరగనున్నాయి. గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగిన తర్వాత సైనిక, దౌత్య మార్గాల్లో జరిగిన చర్చల్లో, సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణకు అంగీకారం కుదిరింది. కానీ డ్రాగన్ దేశం మళ్లీ తోకజాడిస్తూ లదాక్ లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ లోని బరాహోతి సరిహద్దు వద్ద గస్తీ చేపట్టింది. దీంతో వాళ్లను దారికి తెచ్చుకునేందుకు చర్చలు అనివార్యమయ్యాయి. ఇదిలా ఉంటే,

జగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామజగన్‌కు బాగా ఇష్టమైన పని ఎత్తుకున్నా -మండలి రద్దుకు పోరాడుతా -తెలుగు కోసం పక్క రాష్ట్రాలకు: రఘురామ

సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిన సమయంలోనే, భారత్ లోని చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్‌లైన్‌ సెమినార్‌లో సీపీఐ, సీపీఎం నేతలు పాల్గొనడాన్ని బీజేపీ తప్పుపట్టింది. భారత్ లోని కమ్యూనిస్టులు ఏనాడూ దేశానికి అండగా లేరని, చైనా చైర్మన్ ను తమ చైర్మన్ గా భావిస్తారని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆరోపించారు. దీనికి లెఫ్ట పార్టీలు సైతం ఘాటుగా కౌంరిచ్చాయి. దేశ స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలు చేసిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందని, మరి బీజేపీ, ఆరెస్సెస్‌, జనసంఘ్‌ పాత్ర ఏమిటని సీపీఐ నేత రాజా ప్రశ్నించారు. చైనాతో అంటకాగుతున్నది, సన్నిహితంగా మెలుగుతున్నది మోదీ సర్కారే అని, షాంగై సహకార సంస్థ, బ్రిక్స్‌ కార్యక్రమాల్లోరే ఇరు దేశాలు చర్చలు జరిపిన సంగతి బీజేపీ గుర్తుంచుకోవాలని కమ్యూనిస్టు నేతలు మండిపడ్డారు.

English summary
India and China are set to hold 12th round of Corps Commander-level talks in Moldo on the Chinese side of the Line of Actual Control around 10:30 am on July 31. India and China are expected to discuss disengagement from the Hot Springs and Gogra Heights areas. other side, the Left parties defended the decision noting that the government itself is engaged with China on several issues and accused the BJP of raising it to divert attention from its government's failures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X