వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్వాన్‌లో చైనా హింసపై అఖిలపక్షం.. ఏకాభిప్రాయ సాధనపై మోదీ ఫోకస్.. లదాక్‌లో యుద్ధవిమానాలు..

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తత, తూర్పు లదాక్ లోని గాల్వాన్ లోయలో 20 మంది భారత సైనికుల్ని చైనా అతి కిరాతకంగా చంపేసిన ఘటన, మరికొందరు సైనికుల్ని బందీలుగా తీసుకుని.. ఆ తర్వాత వదిలేయడం.. తదితర వ్యవహారాలపై వాస్తవ పరిస్థితిని వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేపట్టిన ఆల్ పార్టీ మీటింగ్ లో ఆయా పక్షాలు తమ వాణిని వినపించాయి. రాబోయే రోజుల్లో చైనా పట్ల ఏ విధమైన స్ట్రాటజీ అనుసరించాలనేదానిపైనా పార్టీల అభిప్రాయాన్ని ప్రధాని అడిగితెలుసుకున్నారు. మొత్తంగా చైనాకు బుద్ధి చెప్పి తీరాల్సిన అవసరం ఉందని నేతలందరూ ముక్తకంఠంతో అన్నారు. సమావేశం ప్రారంభంలో.. అమరులైన 20 మంది జవాన్లకు నేతలు నివాళులు అర్పించారు. సంతాప సూచనగా రెండు నిమిషాలు మౌనం పాటించారు.

గాల్వాన్‌లో భయానక నిశబ్దం.. రగిలిపోతోన్న భారత శిబిరాలు.. మోదీ సర్కార్ నిద్రపోతోందంటూ.. గాల్వాన్‌లో భయానక నిశబ్దం.. రగిలిపోతోన్న భారత శిబిరాలు.. మోదీ సర్కార్ నిద్రపోతోందంటూ..

వాళ్లకు నో ఛాన్స్..

వాళ్లకు నో ఛాన్స్..


కీలకమైన చైనా హింస అంశంపై కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీతోపాటు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా పాల్గొన్నారు. బీజేపీ తరఫున ఆ పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైస్ జగన్, టీఆర్ఎస్ సారధి, తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేడీ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే సహా 20 మంది కీలక నేతలు భేటీలో తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కాగా, ఈ సమావేశానికి టీడీపీ, ఆప్, ఆర్జేడీ లాంటి పార్టీలను దూరం పెట్టడం వివాదాస్పదమైంది. అయితే, లోక్ సభలో ఐదు, అంతకంటే ఎక్కువ మంది ఎంపీలున్న పార్టీలను మాత్రమే మీటింగ్ కు పిలిచినట్లు కేంద్రం స్పష్టత ఇచ్చింది.

షాకింగ్: చైనా ఖైదులో భారత జవాన్లు.. చర్చలతో 10 మంది విడుదల.. డ్రాగన్ లక్ష్యం నెరవేరినట్లేనా?షాకింగ్: చైనా ఖైదులో భారత జవాన్లు.. చర్చలతో 10 మంది విడుదల.. డ్రాగన్ లక్ష్యం నెరవేరినట్లేనా?

ఇటు చర్చలు.. అటు యుద్ధసన్నద్ధత..

ఇటు చర్చలు.. అటు యుద్ధసన్నద్ధత..

చైనాను కట్టడి చేసే విషయమై ప్రధాని మోదీ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతున్న సమయానికే.. సరిహద్దుకు సమీపంగా లదాక్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు, హెలికాపక్టర్లు చక్కర్లు కొట్టాయి. లేహ్, లదాక్ చుట్టుపక్కల.. అత్యధునిక అపాచీ హెలికాప్టర్లు, అప్ గ్రేడ్ చేసిన మిగ్-29 యుద్ధ విమానాలు తిరుగాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ భదౌరియా శుక్రవారం లదాక్ ప్రాంతానికి వెళ్లారు. లేహ్ లో ఆయన కీలక రివ్యూ నిర్వహించారు.

మోదీ ఏమన్నారంటే..

మోదీ ఏమన్నారంటే..


రాబోయే రోజుల్లో చైనా పట్ల అనుసరించాల్సిన రణనీతిపై అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయాన్ని సాదించడంపై ప్రధాని మోదీ దృష్టిసారించారు. సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రతను కాపాడుకునే విషయంలో ఇప్పటిదాకా వెనుకడుగు వేయలేదని పార్టీల నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలసింది. ‘‘మన భూభాగాన్ని కాపాడుకోడానికి, అదే సమయంలో ఉద్రిక్తతల్నినివారించడానికి సైనికపరంగానే కాకుండా దౌత్యపరంగానూ విశేష ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది'' అని ప్రధాని పునరుద్ఘాటించినట్లు సమాచారం.

Recommended Video

KCR Announces Rs 5 Cr Ex-gratia to Col Santosh's Family & Rs 10 Lakh Each of 19 Other Soldiers
జైశంకర్ బ్రీఫింగ్..

జైశంకర్ బ్రీఫింగ్..

లదాక్ లోని గాల్వాన్ లోయ, పాంగాంగ్ సరస్సు తదితర కీలక ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిపై, భారత బలగాల సన్నద్ధతపై హోం మంత్రి అమిత్ షా.. అన్ని పార్టీల నేతలకు వివరించారు. ఆవెంటనే, విదేశాంగ మంత్రి జైశంకర్.. చైనాతో జరిపిన చర్చల సారాన్ని, దౌత్య పరమైన ప్రయత్నాలను, సైనిక బలగాల ఉపసంహరణ ప్రక్రియకు సంబంధించిన వివరాలను నేతలకు బ్రీఫ్ చేశారు.

English summary
amid India-China clash at Ladakh and the death of 20 jawans, an all-party meeting was chaired by Prime Minister Narendra Modi on friday to discuss further strategy. parties expressed their different opinions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X