వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా మెడలు వంచే యత్నం - 4గంటలపాటు బ్రిడేడ్ చీఫ్‌ల చర్చలు - లెఫ్టినెంట్ జనరల్స్ భేటీకి ఒకే

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోయే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సు దక్షిణ ప్రాంతంపై భారత జవాన్లు పట్టు బిగించడంతో ఇరుకునపడ్డ చైనాను.. వెనక్కి తగ్గేలా చేసేందుకు భారత్ ఒత్తిడి పెంచింది. బుధవారం రెండు దేశాల సైనిక బ్రిగేడ్ కమాండర్ల మధ్య నాలుగు గంటలపాటు చర్చలు సాగాయి.

Recommended Video

India-China Stand Off : భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు తొలగిపోయే దిశగా కీలక పరిణామం! || Oneindia

చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా 'వార్'నింగ్చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా 'వార్'నింగ్

కొద్దిరోజులుగా అన్ని స్థాయిల చర్చలు దాదాపు విఫలమవుతూరాగా.. బుధవారం నాటి భేటీలో కొంత పురోగతి కనిపించింది. మరోసారి కార్ప్స్ కమాండర్ (లెఫ్టినెంట్ జనరల్) స్థాయిలో చర్చలు జరిపేందుకు రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది. గాల్వాన్ ఘర్షణ తర్వాత లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో ఇప్పటివరకు ఐదు సార్లు చర్చలు జరిగాయి. ప్రతిసారి చైనా మడతపేచీలు పెడుతూ వచ్చింది.

India, China hold BC level talks, Agree To Hold Corps Commander Level Talks

అయితే , సోమవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్న చుషూల్ సెక్టార్ లోని దాదాపు అన్ని కీలక స్థావరాలపై భారత్ పట్టు బిగించిన దరిమిలా ఈసారి జరగబోయే చర్చలు భిన్నంగానే ఉండొచ్చని తెలుస్తోంది. లెఫ్టినెంట్ జనరల్స్ మధ్య ఆరో సమావేశం ఎప్పుడు నిర్వహించాలి? అజెండా ఏమిటి? అనేదానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని ఆర్మీ వర్గాలు తెలిపారు.

మంత్రి కొడాలి నానిపై ఎదురుదాడి - విజయవాడ సీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు-తొలిసారి నారా లోకేశ్ రియాక్షన్మంత్రి కొడాలి నానిపై ఎదురుదాడి - విజయవాడ సీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు-తొలిసారి నారా లోకేశ్ రియాక్షన్

ఎల్ఏసీ వద్ద రెండు దేశాల సైనికులు గాల్లోకి కాల్పులు జరపడం.. దాదాపు 40 ఏళ్ల తర్వాత సరిహద్దులో తుపాకి చప్పుళ్లు చోటుచేసుకున్న ఘటన ఇదే కావడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారత్ విశేషంగా కృషిచేస్తున్నది. గతంలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సమావేశానికి భారత్ తరఫున 14వ కార్ప్స్ విభాగానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ హాజరుకాగా, చైనా తరఫున ఆ దేశ వెస్ట్రన్ థియేటర్ కమాండ్ చీఫ్ హాజరయ్యారు.

English summary
India and China held Brigade Commander level talks on Wednesday in which both sides have agreed on holding Corps Commander level talks for which the date, modalities, and agenda are yet to be finalised, Indian Army sources said.Brigade commander level talks in Chushul was held today from 11 AM to 3 PM. Armies of India and China continue to communicate with each other even as Chinese troops are in a face-off position with Indian troops near the Rezang La heights, Indian Army sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X