ట్రంప్ కు నోబెల్ బహుమతా..? భారత్ షాకింగ్ రియాక్షన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వాలా..? ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్య ఈ ప్రశ్నపై చర్చలు నడుస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ నేతలు ఈ సారి ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి పక్కా అని సంబరాలు చేసుకుంటున్నారు. వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో యుద్ధాలను ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఆగిపోయాయని.. ఎన్నో ఉద్రిక్తతలను ట్రంప్ నిలిపివేశారని చెప్పుకొచ్చారు. ట్రంప్ నిర్ణయాలతోనే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగిందని తెలిపారు. అందుకే ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు.
" అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎన్నో యుద్ధాలను ఆపారు. థాయ్ లాండ్- కాంబోడియా మధ్య , ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య రవాండ- డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మధ్య, భారత్- పాకిస్థాన్ మధ్య, సెర్బియా- కోసోవో, ఈజిప్టు- ఇథియోపియా.. ఇలా గత ఆరు నెలలుగా ప్రతి నెల ఒక కాల్పుల విరమణ ఒప్పందం చేశారు. ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వడానికి ఇదే సరైన సమయం" అని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే భారత విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్.. ట్రంప్ కు నోబెల్ బహుమతి పై సైలెంట్ గా వ్యవహరించారు. ఈ విషయంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.
ఇక భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం తానే ఆపేసినట్లు ట్రంప్ ఇప్పటికే చాలాసార్లు ప్రకటించుకున్నారు. ఓవైపు భారత్.. తాము ఎవరి సలహా తీసుకోలేదని.. ప్రపంచంలోని ఏ నాయకుడు గానీ యుద్ధం ఆపమని చెప్పలేదని చెబుతుంటే ట్రంప్ మాత్రం తానే యుద్ధం ఆపేశాసని చెప్పుకుంటున్నారు. ఇటీవల లోక్ సభలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ నిలిపివేయమని ఏ అంతర్జాతీయ శక్తి తమకు చెప్పలేదని అన్నారు.
" ఆపరేషన్ సింధూర్ ను ఆపేయమని ప్రపంచంలో ఏ నాయకుడు కూడా మాకు చెప్పలేదు. మే 9న రాత్రి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఒక గంట పాటు ప్రయత్నించారు. కానీ నేను ఆర్మీతో మీటింగ్ లో ఉన్నాను. దాంతో ఆయన ఫోన్ ఎత్తలేదు. ఆ తర్వాత నేనే అతనికి ఫోన్ చేశాను. అప్పుడు జేడీ వాన్స్ నాతో మాట్లాడుతూ.. పాకిస్థాన్ పెద్ద ఎటాక్ చేయబోతోందని చెప్పారు. నేను బదులిస్తూ.. పాకిస్థాన్ అలా చేస్తే ఆ దేశం మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పాను. పాకిస్థాన్ దాడి చేస్తే మేము అంతకంటే పెద్ద దాడి చేస్తాం అని చెప్పాను. నా సమాధానం ఇదే" అని ప్రధాని మోదీ లోక్ సభలో పేర్కొన్నారు. అటు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం.. భారత్ కు ప్రపంచంలోని ఏ నాయకుడూ ఆపరేషన్ నిలిపివేయాలని చెప్పలేదని స్పష్టం చేశారు.

ఇక అమెరికా చరిత్రలో ఇప్పటివరకు నలుగురు అమెరికా అధ్యక్షులు నోబెల్ శాంతి బహుమతిని పొందారు. థియోడర్ రోస్ వెల్ట్(1906), వుడ్ రో విల్ సన్(1919), జిమ్మీ కార్టర్(2002), చివరగా బరాక్ ఒబామా(2009) ఉన్నారు. ఈ క్రమంలో ఈ అవార్డును ఎలాగైనా సాధించి వీళ్ల సరసన చేరాలని ట్రంప్ తెగ ఉవ్విళ్లూరుతున్నారు.
-
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
మార్కాపురం బస్సు ప్రమాద బాధితుల కోసం ప్రధాని కీలక ప్రకటన..!! -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు











Click it and Unblock the Notifications