జైపూర్ లో బ్రిటిషర్ల దేశ బహిష్కరణ..! పాలస్తీనా-ఇజ్రాయెల్ చిచ్చు..!
భారత్ లోనూ ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం చిచ్చు పెడుతోంది. పాలస్తీనా భూభాగాల్ని ఆక్రమించుకున్న ఇజ్రాయెల్ పై ఆ దేశానికి చెందిన హమాస్ దాడులు చేయడం, దానికి ప్రతిగా ఇజ్రాయెల్ కూడా భీకర పోరాటాలు చేయడం చూశాం. ఆ తర్వాత అమెరికా జోక్యంతో ఇరుదేశాల మధ్య యుద్ధం ఆగింది. అనంతరం ఏర్పాటు చేసిన గాజా శాంతి కమిటీలో చేరాలని భారత్ కూ ఆహ్వానం అందింది. అయితే ఇప్పటివరకూ భారత్ ఈ విషయంలో స్పందించలేదు. కానీ దేశంలో అంతర్గతంగా మాత్రం ఇజ్రాయెల్ కు మద్దతుగా, పాలస్తీనాకు వ్యతిరేకంగా విద్వేష వైఖరి కొనసాగుతున్నట్లు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
జైపూర్ లో బ్రిటిషర్ల కలకలం (british)
రాజస్థాన్ రాజధాని జైపూర్ లో తాజాగా చోటు చేసుకున్న ఓ ఘటనే ఇందుకు నిదర్శనం. భారత్ తో ఎప్పటి నుంచో మిత్రదేశంగా ఉన్న పాలస్తీనాతో పాటు కొన్నేళ్లుగా మితృతం పెంచుకున్న ఇజ్రాయెల్ విషయంలోనూ విదేశాంగవిధానం స్పష్టంగానే ఉంది. అయితే తాజాగా జైపూర్ కు వచ్చిన ఇద్దరు బ్రిటీష్ (british) పర్యాటకులు పాలస్తీనాకు విముక్తి కల్పించండి-ఇజ్రాయెల్ ను బహిష్కరించండి (Free palestine-boycott Israel) పేరుతో స్థానికంగా పోస్టర్లు అంటించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

పాలస్తీనా పోస్టర్లపై దేశ బహిష్కరణ
బ్రిటన్ కు చెందిన జంట లూయిస్ గాబ్రియేల్, అతని గర్ల్ ఫ్రెండ్ అనూషీ ఎమ్మా ఇద్దరూ ఇలా పోస్టర్లు అంటించారని తెలుసుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీసా నిబంధనల ఉల్లంఘన కింద వారిని దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. జనవరి 21న చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పర్యాటక వీసాపై వచ్చి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్న కారణంతో వీరిని వీసా నిబంధనల ఉల్లంఘన కింద దేశం నుంచి వెనక్కి పంపినట్లు రాజస్థాన్ పోలీసులు వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications