అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధం కొనసాగింపు: జూన్ 30 వరకు, కార్గో సర్వీసులకు ఓకే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై కొనసాగుతున్న నిషేధాన్ని మరోసారి పొడిగించింది. జూన్ 30 వరకు ఈ నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డీజీసీఏ డైరెక్టరేట్ జనరల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
అయితే, కార్గో సర్వీసులకు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని తెలిపింది. మనదేశంలో కరోనా విజృంభిస్తుండటంతో 2020 మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.

వందేభారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమాన సేవలు గత ఏడాది మే నుంచి మొదలయ్యాయి. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, ఫ్రాన్స్, భూటాన్ తోపాటు 27 దేశాలతో భారత్.. ఎయిర్ బబుల్ ద్వారా రాకపోకలను కొనసాగిస్తోంది. సెకండ్ వేవ్‌లో మనదేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో భారత్ నుంచి విమానాలను చాలా దేశాలు తాత్కాలికంగా నిషేధించాయి.
Recommended Video
అయితే, గత కొద్ది రోజులుగా మనదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24గంటల్లో 20,70,508 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 1,86,364 మందికి కరోనా సోకినట్లు తేలింది. సుమారు 44 రోజుల తర్వాత మొదటిసారి 2 లక్షలకు తక్కువగా కేసులు నమోదుకావడం గమనార్హం. ఒక్క రోజు వ్యవధిలో 3660 మంది కరోనాతో మరణించగా, 3,18,895 మంది ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారినపడి చనిపోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23,43,152 యాక్టివ్ కేసులున్నాయి.












Click it and Unblock the Notifications