వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా శాస్త్రజ్ఞుల కంటే మన పండితులు గ్రేట్: మహర్షులపై రాజ్‌నాథ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోమవారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా శాస్త్రవేత్తల కంటే భారతీయ పండితులు గొప్పవారని ఆయన అభిప్రాయపడ్డారు. లక్నో విశ్వవిద్యాలయంలోని కన్వోకేషన్‌లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రాచీన భారతీయుల జ్ఞానాన్ని కొనియాడారు.

ప్రస్తుతం మీడియా లేదా చాలామంది అమెరికా శాస్త్రజ్ఞులే సూర్య, చంద్ర గ్రహణాల గురించి ఎప్పుడు వస్తాయో కచ్చితమైన సమయం, తేదీ చెబుతారని భావిస్తారని, కానీ ఇక్కడి మన పండితులను వాటి గురించి అడిగితే పంచాంగం చూసి పూర్తి విషయాలు చెబుతారన్నారు. రానున్న వంద ఏళ్ల చంద్ర, సూర్య గ్రహణాల గురించి కూడా చెప్పగలన్నారు.

India gave quadratic equation to world: Rajnath Singh

భూమి పుట్టి 196 కోట్ల సంవత్సరాలు అవుతుందని మన మహర్షులు ఎప్పుడో చెప్పారని, అయితే దానిని సైన్స్ నమ్మలేదన్నారు. కానీ, ఇప్పుడు వారు చెప్పినవి నిజమేనని సైన్స్ చెబుతోందన్నారు. ఆస్ట్రాలజీ, సైన్స్, మేథమేటిక్స్ తదితరాలకు మన మహర్షులు ఎంతో చేశారన్నారు.

క్వాడ్రాటిక్ ఈక్వేషన్ (A+B)2 = A2 + B2 + 2ABను భారతీయ మహర్షి ధరాచార్య కనుగొన్నారని తెలిపారు. దీనిని ప్రపంచానికి ఇచ్చింది మనమే అన్నారు. కాగా, రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. హాయ్, బాయ్ సంస్కృతికి ముగింపు పలకాలని ఢిల్లీలో యువతను కోరారు. తల్లిదండ్రుల కాళ్లను మొక్కటం మన సంస్కృతి అన్నారు.

English summary
Hailing India's contribution to astronomy, science and mathematics, Union home minister Rajnath Singh on Monday said the quadratic equation was formulated in the country and the neighbourhood pandit could give more accurate astronomical predictions than scientists and astronomers sitting in observatories in the US.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X