ఓమిక్రాన్ ఎఫెక్ట్-అనధికార లాక్ డౌన్ దేశగా భారత్-రాత్రిపూట కర్ఫ్యూలు-పగలూ ఆంక్షలు

భారత్ లో ఓమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. కేంద్రం ఎంత లేదని చెప్తున్నా రాష్ట్రాల్లో మాత్రం పరిస్ధితి భిన్నంగా ఉంది. పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులతో రాష్ట్రాలు క్రమంగా అనధికారిక లాక్ డౌన్ దిశగా పయనిస్తున్నాయి. కేంద్రం కూడా ఆంక్షలు పెంచాలని సూచిస్తుండటంతో రాష్ట్రాలు కూడా కర్ఫ్యూలతో పాటు ఆంక్షలూ విధిస్తున్నాయి. కేసుల సంఖ్య మరింత తీవ్రమైతే మాత్రం త్వరలో లాక్ డౌన్ లు తప్పేలా లేవు.

 ఓమిక్రాన్ భయాలు

ఓమిక్రాన్ భయాలు

గత నెలలో దక్షిణాఫ్రికాలో మొదలైన ఓమిక్రాన్ వైరస్ ముప్పు ఇప్పుడు భారత్ ను గట్టిగా తాకుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువగానే కేసులు నమోదవుతుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా అప్రమత్తమవుతున్నాయి. మొదట్లో ఒకటిరెండు కేసులు కనిపించినా చూస్తుండగానే రెండు వారాల్లోనే దాదాపు 400 కేసులకు పరిస్ధితి చేరిపోయింది. దీంతో పాటు ఓమిక్రాన్ వ్యాప్తి కూడా లక్షణాలు లేకుండానే సాగిపోతుండటంతో ఇప్పుడు దాని తీవ్రత గుర్తించడం కూడా కష్టంగా మారిపోయింది. రోగం ముదిరితే తప్ప ఓమిక్రాన్ అని గుర్తించలేని పరిస్ధితులు కనిపిస్తున్నాయి.

 లక్షణాల్లేకపోవడమే అసలు సమస్య

లక్షణాల్లేకపోవడమే అసలు సమస్య

ఓమిక్రాన్ వైరస్ గతంలో వచ్చిన వేరియంట్ల మాదిరిగా లక్షణాలతో కాకుండా లక్షణాలు లేకుండా ఉండటంతో ఇప్పుడు రోగుల్ని వెంటనే గుర్తించడం సాధ్యం కావడం లేదు. దీంతో విదేశాలతో పాటు ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని వారు కూడా బాధితులుగా మారిపోతున్నారు. వీరికి అప్పటికే వైరస్ సోకిన వారి నుంచి వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పుడు దేశంలో ఏ స్ధాయిలో వైరస్ వ్యాప్తి జరిగిందో ఎవరికీ తెలియని పరిస్ధితి. దీంతో లక్షణాలు పైకి కనిపించని వ్యాధిని గుర్తించడమెలాగో తెలియక కేంద్రం కూడా తలపట్టుకుంటోంది.

 రాష్ట్రాల్లో అనధికార లాక్ డౌన్లు

రాష్ట్రాల్లో అనధికార లాక్ డౌన్లు

ఓమిక్రాన్ వైరస్ ముప్పు చాపకింద నీరులా వ్యాప్తిస్తుండటంతో కేంద్రం మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు లాక్ డౌన్ ల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్, యూపీతో పాటు పలు రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూలు ప్రకటించాయి. అంతే కాదు పగటి పూట కూడా జనం ఎక్కువగా గుమికూడే కార్యక్రమాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఆయా చోట్ల అనధికార లాక్ డౌన్ అమలులోకి వచ్చినట్లే అనిపిస్తోంది. తెలంగాణ వంటి కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు కూడా త్వరలో ఇదే బాటలో సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా పరిస్ధితి ముదిరితే పూర్తిస్దాయిలో లాక్ డౌన్ లు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 బూస్టర్ డోస్ పై కేంద్రం మౌనం

బూస్టర్ డోస్ పై కేంద్రం మౌనం

రాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. వీటిలోనూ లక్షణాలు లేని కేసులతో పాటు ఇప్పటికే వ్యాక్సిన్ వేయించుకున్న వారికీ సోకుతున్న కేసులు కూడా భారీగా ఉంటున్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన డేటా ప్రకారం ఇప్పటిదాకా ఓమిక్రాన్ సోకిన వారిలో 91 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారేనని కేంద్రం ప్రకటించింది. దీంతో బూస్టర్ డోస్ డిమాండ్ మరింత పెరుగుతోంది. కానీ బూస్టర్ డోస్ విధానం విషయంలో కేంద్రం మౌనం వహిస్తోంది. ఇప్పటికే నిపుణుల కమిటీ దీనిపై అధ్యయనం ప్రారంభించినా అది ఎప్పటికల్లా పూర్తవుతుందో తెలియదు. దీంతో బూస్టర్ డోస్ కోసం డిమాండ్ మరింత పెరగబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+