35% మంది సిఎంలపై క్రిమినల్ కేసులు: 85% మంది కోటీశ్వర్లు

Posted By:
Subscribe to Oneindia Telugu
  India's Richest CMs : Chandrababu on Top, No BJP CMs

  న్యూఢిల్లీ: దేశంలోని 31 మంది ముఖ్యమంత్రుల్లో 35 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 85 శాతం మంది కోటీశ్వర్లు. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించాయి.

  ఎన్నికల సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఆ సంస్థలు విశ్లేషణ జరిపి వివరాలను వెల్లడించాయి. రాష్ట్ర శాసనసభలు, కేంద్ర పాలిత ముఖ్యమంత్రుల వివరాలను విశ్లేషించాయి.

  35 శాతం మందిపై క్రిమినల్ కేసులు

  35 శాతం మందిపై క్రిమినల్ కేసులు

  మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 11 మంది అంటే 35 శాతం మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు నమోదైనట్లు ఎడిఆర్ నివేదిక వెల్లడించింది. ఈ కేసుల్లో 26 మందిపై నమోదైనవి తీవ్రమైన కేసులు. హత్య, హత్యాప్రయత్నం, మోసం, తదితర కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌పై అత్యధిక కేసులు నమోదయ్యాయి.

  25 మంది కోటీశ్వర్లు

  25 మంది కోటీశ్వర్లు


  దేశంలోని 25 మంది ముఖ్యమంత్రులు కోటీశ్వర్లు. అంటే 81 శాతం మంది కోటీశ్వర్లు.. వారిలో ఇద్దరి ఆస్తుల విలువ వంద కోట్లకు పైగా ఉంది. ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ రూ. 1618 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సిఎంల్లో అత్యంత ధనికుడు.ఆయన ఆస్తుల విలువ 177 కోట్ల రూపాయలు.

  పాన్ నెంబర్ ఇవ్వని సిఎంలు ఇద్దరు

  పాన్ నెంబర్ ఇవ్వని సిఎంలు ఇద్దరు

  ముఖ్యమంత్రుల్లో అతి పేదవాడు త్రిపుర సిఎం మాణిక్ సర్కార్. సిపిఎంకు చెందిన ఆయన ఆస్తుల విలుల 26 లక్షల రూపాయల పైచిలుకు మాత్రమే. పాన్ నెంబర్ ఇవ్వని ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఆయనొకరు. నాగాలాండ్ ముఖ్యమంత్రి టిఆర్ జెలియాంగ్‌కు రెండు కోట్ల దాకా ఆస్తులున్నాయి. ఈయనకు పాన్ నెంబర్ లేదు.

  ఇంటర్ మాత్రమే చదివినవారు ముగ్గురు

  ఇంటర్ మాత్రమే చదివినవారు ముగ్గురు

  ముఖ్యమంత్రుల్లో ఇంటర్మీడియట్ వరకు చదివినవారు ముగ్గురు ఉన్నారు. గ్యాడ్యుయేట్లు 12 మంది, వృత్తి విద్యా గ్రాడ్యుయేట్లు 10 మంది ఉన్నారు. పోస్టు గ్రాడ్యుయేట్లు ఐదుగురు, డాక్టరేట్ ఒకరు ఉన్నారు. అతని చిన్న వయస్కుడు పెమా ఖండూ (35 ఏళ్లు), రెండు, మూడు స్థానాల్లో దేవేంద్ర ఫడ్నవీస్ (44 ఏళ్లు), యోగి ఆదిత్యానాథ్ (45 ఏళ్లు). అతి పెద్ద వయస్కుడు అమరీందర్ సింగ్ (74), ఆ తర్వాతి స్థానం పినరయి విజయన్ (72)ది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In India, around 35 per cent chief ministers have criminal cases against them and 81 per cent of the total are crorepatis, according to an ADR report released today.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి