వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాలో కరోనా : 4వేలకు పైగా మరణాల రికార్డు, మూడోరోజు వరుసగా 4లక్షలకు పైగా కేసులు

|
Google Oneindia TeluguNews

భారత దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది.మరణ మృదంగం మోగిస్తోంది.నిన్నటి వరకు మూడు వేలకు పైగా మరణాలు నమోదైన భారత దేశంలో తాజాగా నాలుగు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక నాలుగు లక్షలకు పైగా కేసులు గత 24 గంటల్లో నమోదవడం భారత దేశంలో కరోనా తీవ్రతకు అద్దం పడుతుంది. గత 24 గంటల్లో భారత్‌లో 4,01,078 కొత్త కరోనా కేసులు నమోదు కాగా , 4,187 మరణాలు నమోదయ్యాయి.

భారత్ రికార్డులు బద్దలు కొడుతూ పైపైకి కేసులు,మరణాలు..తాజాగా 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలుభారత్ రికార్డులు బద్దలు కొడుతూ పైపైకి కేసులు,మరణాలు..తాజాగా 4,14,188 కరోనా కేసులు,3,915 మరణాలు

 నిన్న ఒక్కరోజే 4,01,078 మందికి పాజిటివ్

నిన్న ఒక్కరోజే 4,01,078 మందికి పాజిటివ్

భారతదేశం ప్రస్తుతం కరోనా మహమ్మారి యొక్క రెండవ తరంగంలో ఊహించని విధంగా కేసులు మరియు మరణాల సునామిని చూస్తోంది. వరుసగా మూడవ రోజు నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో దేశంలో 18,26,490 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 4,01,078 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.18 కోట్లకు చేరుకుంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పుడు వరకు మరణించిన వారి సంఖ్య 2,38,270 మంది. ఇప్పటివరకు నమోదైన మరణాల రేటు 1.09 శాతంగా ఉంది.

దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446

దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446

గడచిన 24 గంటల్లో 3,18,609 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీ ల సంఖ్య 1.79 కోట్లకు చేరుకుంది. రికవరీ రేటు 81.95 శాతం గా ఉంది. కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 37,23,446. క్రియాశీల కేసుల రేటు 16.96 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ తో సహా 10 రాష్ట్రాలు శుక్రవారం 71.81% కొత్త కేసులను నమోదు చేశాయి.

 కర్ణాటకలో కరోనా కట్టడికి సంపూర్ణ లాక్ డౌన్

కర్ణాటకలో కరోనా కట్టడికి సంపూర్ణ లాక్ డౌన్

మహమ్మారి బారినపడిన రెండవ చెత్త రాష్ట్రంగా ఉన్న కర్ణాటకలో ఇప్పటివరకు 1.8 మిలియన్లకు పైగా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం, కర్ణాటకలో రోజువారీ మరణాలలో అత్యధికంగా 592 మంది ఉండగా, 48,791 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మే 10 ఉదయం 6 గంటల నుండి మే 24 ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు కర్ణాటక సీఎం యడ్యూరప్ప. కరోనా కట్టడికి విఫల యత్నం చేస్తున్నారు.

Recommended Video

Covid Vaccination : 'Shot And A Beer' వ్యాక్సిన్ తీసుకుంటే ఫ్రీగా బీరు || Oneindia Telugu
 మహారాష్ట్రలో తగ్గుతున్న కేసులు , ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

మహారాష్ట్రలో తగ్గుతున్న కేసులు , ఢిల్లీ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత

మహారాష్ట్ర లో గత 24 గంటల్లో 54,022 కొత్త కేసులు నమోదు కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సంభవించిన మొత్తం మరణాలు 74,413. మహారాష్ట్రలో కేసుల సంఖ్య కొద్దికొద్దిగా తగ్గుముఖం పడుతున్న సంకేతాలు మహారాష్ట్ర సర్కార్ కు కాస్త ఊరట ఇస్తున్నాయి.అయినప్పటికీ మహారాష్ట్రలో ఆరోగ్య సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఇదిలా ఉంటే ఢిల్లీలోనూ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కొనసాగుతూనే ఉంది. మరోపక్క తెలుగురాష్ట్రాల్లోనూ కేసులు తీవరంగా పెరుగుతున్నాయి.

English summary
India on Saturday recorded 401,078 new coronavirus disease (Covid-19) cases and 4,187 deaths in the last 24 hours, taking the caseload and death toll to 21,892,676 and 238,270 respectively, according to the Union health ministry's dashboard.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X