మా దేశం, మా హక్కు: చైనాకు అమిత్ షా దిమ్మతిరిగే కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

రాంచీ: ఈశాన్య రాష్ట్రాల్లో జపాన్ పెట్టుబడులపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా డ్రాగన్ కంట్రీకి గట్టి కౌంటర్ ఇచ్చారు.

డొక్లాం భారత్‌కు అవసరం లేదుగా అంటున్నారు కానీ, యుద్ధం కాదు: చైనా

చైనా తీరును తప్పుబట్టిన షా

చైనా తీరును తప్పుబట్టిన షా

తమ దేశ సరిహద్దుల్లో అభివృద్ధి చేసుకునే సార్వభౌమాధికారం భారతదేశానికి ఉందని అమిత్ షా చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తి చూపిస్తుండటంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.

అది మా హక్కు

అది మా హక్కు

భారతదేశ విధానాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారని అమిత్ షా గుర్తు చేశారు. మన దేశ సరిహద్దుల్లో అభివృద్ధి చేసుకునే సార్వభౌమాధికారం మనకు ఉందని తెలిపారు. ఆ హక్కును వినియోగించుకుంటామన్నారు.

చైనా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు

చైనా అసందర్భ, అనుచిత వ్యాఖ్యలు

ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సంసిద్దత వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ.. చైనా-భారత్ సరిహద్దు వివాదాల్లో మూడో పక్షం జోక్యాన్ని సహించబోమని ప్రకటించింది. తమతో వివాదం ఉన్న ప్రాంతాల్లో విదేశీ పెట్టుబడులను వ్యతిరేకిస్తామని పేర్కొంది.

ఇదే చైనా కోపం

ఇదే చైనా కోపం

ఇటీవల ప్రధాని మోడీ-జపాన్ ప్రధాని షింజో అబే భేటీ నేపథ్యంలో భారత్-జపాన్ సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ రెండు రోజుల క్రితం స్పందించింది. దక్షిణ చైనా సముద్రంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, చైనా తలపెట్టిన వన్ రోడ్-వన్ బెల్ట్ ప్రాజెక్టుపై ఆందోళన తదితర అంశాలు ఈ ప్రకటనలో ఉన్నాయి. అంతేగాక, ‘భారత్-జపాన్ యాక్ట్ ఈస్ట్ ఫోరమ్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఫోరంలో భాగంగా ఈశాన్య భారతదేశంలో జపాన్ పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయంపైనే చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP President Amit Shah on Saturday asserted that India has the sovereign right to develop the country within its boundaries, dismissing China's objection to Japan showing interests in investment in the north eastern states.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X