వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్షల్లో కుబేరులు : ఆసియా పసిఫిక్ లో భారత్ స్థానం !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్ లో కుబేరులు మరింత పెరిగిపోయారు. ఆసియా పసిఫిక్ రీజియన్ లో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆసియా పసిఫిక్ రీజియన్ లో అత్యధికంగా కుబేరులు ఉన్న దేశంగా జపాన్ మొదటి స్థానంలో, చైనా రెండో స్థానంలో, ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉన్నాయి.

2014 సంవత్సరంలో భారత్ లో 1.8 లక్షల మంది కుబేరులు ఉన్నారు. 2015లో ఆ సంఖ్య రెండు లక్షలకు పెరిగింది. ఇదే మధ్య కాలంలో వీరి సంపాదన 1.6 శాతం పెరిగి 79,700 కోట్ల డాలర్లకు చేరుకుందని క్యాప్ జెమినీ నివేదిక వెల్లడించింది.

India home to 4th largest population of high net worth individuals

ఆసియా పసిఫిక్ రీజియన్ లో కుబేరుల స్థానంలో జపాన్ మొదటి స్థానంలో ఉండగా ఆదేశంలో కుబేరుల సంఖ్య 27 లక్షలకు పైగా ఉందని క్యాప్ జెమినీ సర్వేలో వెలుగు చూసింది. జపాన్ లో కుబేరుల సంపాదన 11.4 శాతం పెరిగి 6,57,100 కోట్ల డాలర్లకు చేరుకుంది.

తరువాత స్థానంలో ఉన్న చైనాలో 10 లక్షలకు పైగా కుబేరులు ఉన్నారు. చైనాలో కుబేరుల సంపద 16.9 శాతం పెరిగి 5,26,100 కోట్ల డాలర్లకు చేరుకుంది. ప్రపంచంలోనే అధిక సంపద కలిగిన కుబేరులు ఆసియా పసిఫిక్ రీజియన్ లో ఉన్నారని క్యాప్ జెమినీ నివేదిక వెల్లడించింది.

గత ఏడాది ఆసియా పసిఫిక్ రీజియన్ లో ఉన్న కుబేరుల సంపద 9.9 శాతం పెరిగి 17.4 లక్షల డాలర్లకు చేరుకుంది. ఇదే మధ్య కాలంలో ప్రపంచంలోని మిగితా దేశాల్లోని కుబేరుల సంపద 1.7 శాతం పెరిగితే ఆసియా పసిఫిక్ రీజియన్ లోని దేశాల్లో మాత్రం 5.6 రెట్లు పెరిగింది.

English summary
The number of HNWIs in India jumped to 2 lakh last year from 1.8 lakh in 2014, while their overall wealth rose by 1.6 percent during the same period, according to the Asia Pacific Wealth Report 2016.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X