కేంద్రం సంచలన నిర్ణయం..! పాకిస్తాన్ కు ఢిల్లీ ఆహ్వానం..!

పహల్గాం దాడులు, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్- పాకిస్తాన్ (India-Pakistan) మధ్య సంబంధాలు ఎన్నడూ లేనంత స్థాయికి దిగజారాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కు సింధు నదీ జలాల్ని భారత్ నిలిపేయడం, వాటిపై పాకిస్తాన్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లి మరీ పోరాడుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీకి రావాలంటూ పాకిస్తాన్ కు భారత్ ఇవాళ ఆహ్వానం పంపింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇలా పాకిస్తాన్ ను ఆహ్వానించడం ఇదే తొలిసారి.

సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!
సీజేపీ వెనుక బీజేపీ ? మోడీ టార్గెట్ గా అన్నామలై తీవ్ర విమర్శలు..!

నవంబర్ 20-21 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సంభాషణల వేదికకు పాకిస్తాన్ జాతీయ వారసత్వ, సాంస్కృతిక శాఖ మంత్రి ఔరంగజేబ్ ఖాన్ ఖిచీని భారత్ ఆహ్వానించినట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు చెలరేగినప్పటి నుండి, పాకిస్తాన్‌కు చెందిన ఒక ఉన్నతాధికారికి భారత్ ఇలా ఆహ్వానం పంపడం ఇదే మొదటిసారి. చివరిసారిగా భారత్ ఒక పాకిస్తాన్ ఉన్నతాధికారికి మే 2023లో ఆతిథ్యం ఇచ్చింది. అప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా ఉన్న బిలావల్ భుట్టో, SCO విదేశాంగ మంత్రుల సమావేశం కోసం గోవాకు వచ్చారు.

India Invites Pakistan to SCO Meeting in Delhi for First Time Since Operation Sindoor
ఏపీకి ఒకేసారి ప్రధాని మోడీ-అమిత్ షా..! తిరుపతిలో టూర్ ఖరారు..!
ఏపీకి ఒకేసారి ప్రధాని మోడీ-అమిత్ షా..! తిరుపతిలో టూర్ ఖరారు..!

ఎస్సీఓ సదస్సు కు ఆతిధ్యం ఇవ్వాలని ఢిల్లీ ప్రతిపాదించినందున, అన్ని సభ్య దేశాల ప్రతినిధులను ఆహ్వానించాల్సిన బాధ్యత ఏర్పడింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్ మంత్రికి ఈ ఆహ్వానం పంపారు. వచ్చే ఏడాది SCO నేత శిఖరాగ్ర సమావేశానికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఢిల్లీకి ఈ దౌత్యపరమైన పని చాలా సులభం. 2016లో జరిగిన పఠాన్‌కోట్, ఉరి ఉగ్రదాడుల తర్వాత దశాబ్దకాలంగా ద్వైపాక్షిక సంబంధాలను స్తంభింపజేసినా. . భారత్.. పాకిస్థాన్‌తో బహుళపక్ష స్థాయిలో చర్చలు జరపాల్సి ఉంది. గతేడాది టియాంజిన్‌లో జరిగిన ఎస్సీఓ దేశాధినేతల మండలి శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా తాము వచ్చే ఏడాది సదస్సుకు ఆతిధ్యం ఇస్తామని ప్రతిపాదించారు. ఈ ఏడాది అక్టోబర్ 20న తజికిస్తాన్‌లోని దుషాన్బేలో జరిగిన 25వ ఎస్సీఓ దేశాధినేతల మండలి సమావేశంలో మన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ దీన్ని ధృవీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+