అంతరిక్షంలో సత్తా చాటిన భారత్, నాల్గో స్పేస్ పవర్‌గా అవతరణ
Recommended Video

ఢిల్లీ : అంతరిక్షంలో భారత్ సత్తా చాటింది. ప్రపంచంలో మరో స్పేస్ పవర్‌గా అవతరించింది. అంతరిక్షంలో లైవ్ శాటిలైట్ ను పేల్చివేసిన భారత్.. అమెరికా, చైనా, రష్యా తర్వాత నాల్గో స్పేస్ పవర్‌గా అవతరించింది. భారత సైంటిస్టులు అంతరిక్షంలో 300కిలోమీటర్ల దూరంలో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ లైవ్ శాటిలైట్ ను విజయవంతంగా కూల్చివేశారని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈ ప్రయోగం విజయవంతం చేసిన సైంటిస్టులకు ఆయన అభినందనలు చెప్పారు.
దేశానికి గర్వకారణం
శాటిలైట్ పేల్చివేతకు సంబంధించిన వివరాలు పంచుకునేందుకు ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం దేశ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఈ ప్రయోగంతో నింగి, నేల, నీటితో పాటు అంతరిక్షం నుంచి జరిగే దాడులను కూడా ఎదుర్కొనే సత్తా భారత్ సొంతమైందని చెప్పారు. ఈ ప్రయోగం ఎవరినీ భయపెట్టేందుకు చేసింది కాదని మోడీ స్పష్టం చేశారు.
శత్రుదేశాలకు హెచ్చరిక
ఎల్ఈఓ శాటిలైట్‌ను పేల్చివేయడంలో విజయం సాధించిన భారత్ శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భారతపై నిఘా పెట్టే ఇతర దేశాల శాటిలైట్లను కూల్చడంతో పాటు వారి కమ్యూనికేషన్ వ్యవస్థను ఇది ధ్వంసం చేయనుంది.













Click it and Unblock the Notifications