వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు వచ్చే వారమే ఆమోదం ? డేటా సమర్పించిన సీరం సంస్థ ఆశాభావం

|
Google Oneindia TeluguNews

ఆస్ట్రాజెనికా కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇండియా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది. వచ్చే వారమే ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) భారత రెగ్యులేటరీ అధికారులు కోరిన అదనపు డేటాను సమర్పించిన కారణంగా వచ్చే వారం నాటికి ఆక్స్ఫర్డ్ ,ఆస్ట్రాజెనికా యొక్క కరోనావైరస్ వ్యాక్సిన్‌ను భారత్ ఆమోదించే అవకాశం ఉందని సమాచారం. బ్రిటిష్ కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్ కు ఇండియా రెగ్యులేటరీ అనుమతి ఇవ్వటం ఇదే మొదటిది.

మీరు మొసళ్ళుగా మారినా అది మీ ప్రాబ్లమ్: వ్యాక్సిన్లపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో షాకింగ్ కామెంట్స్మీరు మొసళ్ళుగా మారినా అది మీ ప్రాబ్లమ్: వ్యాక్సిన్లపై బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో షాకింగ్ కామెంట్స్

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు వారం రోజుల్లో అత్యవసర వినియోగానికి ఆమోదం ?

ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కు వారం రోజుల్లో అత్యవసర వినియోగానికి ఆమోదం ?

ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ దేశమైన ఇండియా వచ్చే నెలలో భారతదేశ పౌరులకు టీకాలు వేయడం ప్రారంభించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఫైజర్ ఇంక్ మరియు స్థానిక సంస్థ భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్ల కోసం అత్యవసర వినియోగానికి అనుమతులు ఇవ్వాలని దరఖాస్తులను కూడా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో ఆస్ట్రా జెనికా వ్యాక్సిన్ కు కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తుంది.తక్కువ-ఆదాయ దేశాలకు మరియు వేడి వాతావరణం ఎక్కువగా ఉండే దేశాల వారికి ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది .

భారత రెగ్యులేటరీకి డేటా సమర్పించిన పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

భారత రెగ్యులేటరీకి డేటా సమర్పించిన పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

ఎందుకంటే ఇది చౌకైనది, రవాణా చేయడం సులభం మరియు సాధారణ ఫ్రిజ్ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు.

భారతదేశ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిస్కో) మొదట డిసెంబర్ 9 న మూడు దరఖాస్తులను సమీక్షించింది . ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లను తయారుచేస్తున్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) తో సహా అన్ని సంస్థల నుండి మరింత సమాచారం కోరింది.ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ అయిన పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మొత్తం డేటాను అందించినట్లు రెండు వర్గాలు తెలిపాయి.

ఆస్ట్రాజెనికా కోసం భారత ఆరోగ్య అధికారులు, బ్రిటిష్ అధికారులతో ప్రత్యక్ష సంప్రదింపులు

ఆస్ట్రాజెనికా కోసం భారత ఆరోగ్య అధికారులు, బ్రిటిష్ అధికారులతో ప్రత్యక్ష సంప్రదింపులు

ఆస్ట్రాజెనెకా షాట్ విషయంలో భారత ఆరోగ్య అధికారులు తమ బ్రిటిష్ అధికారులతో ప్రత్యక్ష సంప్రదింపులు జరుపుతున్నారని, వచ్చే వారం నాటికి ఆమోదం లభిస్తుందని "బలమైన సూచనలు" ఉన్నాయని రెండు వర్గాలు తెలిపాయి. ఫైజర్ నుండి మరిన్ని వివరాల కోసం అధికారులు కోరారు. వారి నుండి ఇంకా పూర్తి డేటా అందాల్సి ఉంది . ప్రభుత్వ ఆరోగ్య సలహాదారు మంగళవారం ఒక వార్తా సమావేశంలో మాట్లాడుతూ, భారత్ బయోటెక్ నుండి అదనపు సమాచారం లభిస్తుందని కూడా పేర్కొన్నారు.

ఇప్పటికే 50 మిలియన్లకు పైగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ లను నిల్వ చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్

ఇప్పటికే 50 మిలియన్లకు పైగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ లను నిల్వ చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్


అత్యధిక కరోనా వైరస్ ప్రభావం ఉన్న ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశమైన ఇండియా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టడం కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో అతి పెద్ద దశ అవుతుందనటం నిస్సంశయం. కరోనా వ్యాక్సిన్ యొక్క రెండు మోతాదుల నియమావళిని భారత రెగ్యులేటర్ పరిశీలిస్తోంది.
భారతదేశం ఇంకా ఏ కంపెనీతోనూ వ్యాక్సిన్ సరఫరా ఒప్పందం కుదుర్చుకోలేదు, కాని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇప్పటికే 50 మిలియన్లకు పైగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ లను నిల్వ చేసింది . అంతేకాదు జూలై నాటికి మొత్తం 400 మిలియన్ మోతాదులను తయారు చేయాలని యోచిస్తోంది.

English summary
India is likely to approve Oxford/AstraZeneca's coronavirus vaccine for emergency use by next week after Serum Institute of India (SII) submitted additional data sought by authorities, two sources with knowledge of the matter told. This could be the first country to give the regulatory green light for the British drugmaker's vaccine as the British medicine regulator continues to examine data from the trials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X