కోటి కేసులకు చేరువగా ఇండియా: గత 24 గంటల్లో 22,890..తగ్గుతున్న కొత్త కేసులతోనే రిలీఫ్
భారతదేశంలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. నిన్న కూడా 25 వేలకు తక్కువగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 22,890 కరోనావైరస్ కేసులు నమోదయినట్లు గా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య ఇప్పుడు 99,79,447 కు చేరుకుంది. ఇది ఒకటి , రెండు రోజుల్లో కోటికి చేరే అవకాశం ఉంది.

దేశంలో కరోనా పరిస్థితి ఇదే ..యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831
ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 3,13, 831 కాగా, 95,20,827 మంది రోగులు ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కారణంగా దేశంలో తాజాగా 338 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 1,44,789 కు చేరుకుంది.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకారం, కోవిడ్ -19 కోసం డిసెంబర్ 17 వరకు మొత్తం దేశంలో 15,89,18,646 నమూనాలను పరీక్షించారు, 11,13,406 నమూనాలను ఒక్క గురువారం పరీక్షించారు.

కర్ణాటకలో కరోనా కంట్రోల్ కోసం నో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
ఇప్పటికే కరోనా కంట్రోల్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధించారు . ఇప్పుడు తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కూడా క్లబ్‌లు, పబ్బులు, రెస్టారెంట్లు మరియు నూతన సంవత్సర వేడుకలకు ప్రజలు సమావేశమయ్యే ఇతర ప్రదేశాలలో డిసెంబర్ 30 మరియు జనవరి 2 మధ్య కార్యక్రమాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇప్పటికీ దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో కరోనా కంట్రోల్ కోసం నిబంధనలు పాటించేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతూనే ఉన్నాయి .

కరోనా వైరస్ మిగతా ఫ్లూ ల కంటే మోస్ట్ డేంజర్
కరోనా మహమ్మారికి సుమారు ఒక సంవత్సరం నుండి ప్రపంచాన్ని వేధిస్తుంది . అయితే ఈ కరోనావైరస్, సీజనల్ ఫ్లూ కంటే భయంకరమైన వైరస్ గా ఉందని స్పష్టమైంది. శుక్రవారం విడుదల చేసిన ఒక అధ్యయనం కరోనా వైరస్ ఎంత దారుణంగా ఉందో పేర్కొంది . కోవిడ్ -19 రోగులలో మరణాల రేటుమిగతా ఫ్లూ ల వల్ల కలిగే మరణాల కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా ఉందని పేర్కొంది. కరోనా వైరస్ మోస్ట్ డేంజరస్ అని అధ్యయనం తేల్చింది .
Recommended Video

కరోనా కేసుల్లో ప్రపంచంలో టాప్ లో అమెరికా , తర్వాత స్థానంలో భారత్
7 మిలియన్ల కరోనా కేసుల మార్కును దాటిన యునైటెడ్ స్టేట్స్ కరోనా కారణంగా అత్యంత ప్రభావితమైన దేశం గా ఉంటే, తర్వాతి స్థానంలో భారతదేశం ఆ తర్వాత బ్రెజిల్ కరోనా కారణంగా ప్రభావితమైన దేశాలుగా ఉన్నాయి. ఈ జాబితాలో రష్యా మరియు ఫ్రాన్స్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94 . 93 శాతం కాగా మరణాల రేటు 1.45 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.












Click it and Unblock the Notifications