భారత్ సంచలన నిర్ణయం.. పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు కట్.. ఇక ఆ దేశం కుక్క చావే

జమ్ముకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రమూకలు జరిపిన మారణహోమానికి భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు అడుగులు ముందుకు వేసింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తీరుపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు పాకిస్థాన్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటించింది. పాక్ పౌరులు, పర్యాటకులు వారంలో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. అటారీ చెకోపోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. పాకిస్థాన్ కు చెందిన పౌరులను భారత్‌లోకి అనుమతించేది తేల్చి చెప్పింది. అంతేకాక పాకిస్థాన్ కు ఇండస్ నదీ జలాలను కూడా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.

పహల్గాం దాడి నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ కమిటీ భేటీలో ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ కు చెందిన పౌరులు వెంటనే భారత్‌ను వీడాలని కేంద్ర విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. పాకిస్థాన్‌ పర్యటకులు, పౌరులు వెంటనే వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. పాకిస్థాన్ పౌరులు భారత్‌లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

India Orders Pakistani Nationals to Leave Within a Week Post Pahalgam Attack

మరోవైపు భారత్ లో ఉన్న పాక్‌ హైకమిషనర్‌ను సైతం దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అటారీ చెక్‌పోస్టును తక్షణమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఇండస్‌ వాటర్‌ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్లు తేల్చి చెప్పింది. కేబినెట్‌ కమిటీలో చర్చించిన అంశాలకు సంబంధించి భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ ఈ వివరాలను వెల్లడించారు.

జమ్మూకశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పెహల్గాంలో ఉగ్రవాదులు మంగళవారం జరిపిన మారణహోమంలో 28 మంది టూరిస్టులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇదో పిరికిపంద చర్యగా అభివర్ణించాయి. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. త్వరలోనే ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా ఉగ్రమూకలకు బదులు చెప్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+