ప్రశాంతమైన దేశాల్లో భారత్‌కు 143వ స్ధానం

న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత ప్రశాంతమైన దేశాల్లో భారత్‌కు 143వ స్ధానం దక్కింది. పొరుగుదేశమైన పాకిస్ధాన్ 154వ స్థానంలో నిలిచింది. ఓ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడించింది.

India ranked 143 among 162 countries in peace index

నేరాలు, తీవ్రవాద హింస, అంతరంగిక భద్రతా పరిస్ధితులు పాకిస్ధాన్‌ను తక్కువ స్ధానానికి దిగజార్చాయిని ఈ సర్వేలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా 162 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఆఫ్గానిస్థాన్‌ అయితే 160 స్థానంలో ఉంది. దక్షణి ఆసియాలో ఈ మూడు దేశాల కంటే భూటాన్‌(18), నేపాల్‌(62), బంగ్లాదేశ్‌(84), శ్రీలంక(114)లు మెరుగైన పరిస్థితిలో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రశాంతమైన దేశంగా ఉత్తర అట్లాంటిక్‌లో ఉన్న ఓ చిన్న ద్వీపమైన ఐస్ లాండ్ అగ్రస్ధానంలో నిలిచింది. ఆ తర్వాతి స్ధానాల్లో డెన్మార్క్‌, ఆస్ట్రియాలు వరుసగా రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. శాంతి ఇండెక్స్-2015 వివరాలను ఆ సంస్థ ఇటీవలే విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+