
దేశంలో అదుపులోనే కరోనా కేసులు, పెరిగిన మరణాలు: 174 కోట్లు దాటిన వ్యాక్సినేషన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. స్వల్ప హెచ్చుతగ్గులు నమోదవుతున్నప్పటికీ అదుపులోనే ఉంది. తాజాగా, గత 24 గంటల వ్యవధిలో 30,757 కరోనా కేసులు రాగా, 541 మరణాలు సంభవించాయి. ఈ మేరకు గురువారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను విడుదల చేసింది.
11 లక్షల మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 30 వేలకుపైగా మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 2.61 శాతంగా ఉంది. గత రెండు రోజులుగా పాజిటివిటీ రేటులో స్పల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక, 2020 ప్రారంభం నుంచి 4.27 కోట్ల మందికి కరోనా సోకింది. ఇందులో 4.19 కోట్ల మంది వైరస్‌ను జయించారు.

గత 24 గంటల వ్యవధిలో 67వేల మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.03 శాతానికి చేరింది. యాక్టివ్ కేసులు 3.3 లక్షల(0.78శాతం) తగ్గాయి. 5,10,413 మంది మృత్యువాత పడ్డారు. బుధవారం 34.7 లక్షల మంది టీకా తీసుకున్నారు. ఇప్పటి వరకు 174 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
CSSE ప్రకారం.. ప్రపంచంలో అత్యధిక కేసులు, మరణాల సంఖ్య 78,169,874.. 928,490తో యూఎస్ అత్యంత కరోనా బాధిత దేశంగా కొనసాగుతోంది.
కేసుల పరంగా రెండవ అత్యంత దెబ్బతిన్న దేశం భారతదేశం (42,723,558 ఇన్‌ఫెక్షన్‌లు, 509,872 మరణాలు), మూడో దేశం బ్రెజిల్ (27,819,996 ఇన్‌ఫెక్షన్లు, 641,096 మరణాలు).
భారతదేశంలో ఆరు రేట్లు మరణాలు ఎక్కువ: స్టడీ
నవంబరు 2021 నాటికి భారతదేశంలో కోవిడ్-19 మరణాల సంఖ్య 3.2-3.7 మిలియన్లకు చేరుకుంటుందని బుధవారం నాడు ఒక కొత్త అధ్యయనం పేర్కొంది, భారతదేశంలో కోవిడ్ మరణాల భారీ లెక్కింపునకు మద్దతుగా మరో సాక్ష్యాన్ని అందించింది.
డిల్లీలోని సెంటర్ డి సైన్సెస్ హుమైన్స్‌లోని పరిశోధకుడు క్రిస్టోఫ్ గిల్‌మోటో, భారతదేశం కోవిడ్ మరణాల సంఖ్య అధికారిక సంఖ్య కంటే దాదాపు ఆరు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉందని అంచనా వేశారు, భయంకరమైన రెండవ తరంగం -- భారతదేశాన్ని ప్రపంచంలో కరోనా బాధిత దేశాలలో ఒకటిగా మార్చిందని పేర్కొన్నారు.