Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో కరోనా డెత్స్ పీక్స్‌లో: ఒక్కరోజులో అత్యధిక మరణాలు: 2.5 కోట్లు దాటిన కేసులు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతిలో భారీగా తగ్గుదల కనిపించింది. మరో రోజు కూడా కేసులు తగ్గుముఖం పట్టాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వరుసగా ఇది అయిదో సారి. వరుసగా రెండో రోజు కూడా రెండు లక్షలకు దిగువగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువగా రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు కావడం ఈ నెలలో ఇది రెండోసారి. మరణాల్లో మాత్రం ఏ మాత్రం స్పీడ్ తగ్గట్లేదు. మరోసారి నాలుగు వేలకు పైగా మరణాలు రికార్డయ్యాయి. ఒక్కరోజులో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య రెండున్నర కోట్లను దాటేసింది.

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,63,533 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4,329 మంది మరణించారు. ఇప్పటిదాకా ఈ స్థాయిలో కరోనా మరణాలు ఎప్పుడూ నమోదు కాలేదు. ఇదే అత్యధికం. డిశ్చార్జీలు కూడా గరిస్ఠస్థాయిలో నమోదయ్యాయి. రికార్డు సృష్టించాయి. ఒక్కరోజులో 4,22,436 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రోజువారీ పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే- డిశ్చార్జీలు రెట్టింపు కావడం కావడం కూడా ఇదే ఫస్ట్‌టైమ్.

India records highest daily toll as 4,329 deaths, total case count crosses 2.5 crore

ఫలితంగా- యాక్టివ్ కేసలు భారీగా తగ్గాయి. 37 లక్షల నుంచి 33 లక్షలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కు చేరింది. ఇందులో 2,15,96,512 మంది కోలుకున్నారు. మరణించిన వారి సంఖ్య 2,78,719కి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 33,53,765గా నమోదైంది. ఇప్పటిదాకా 18,44,53,149 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం తన తాజా బులెటిన్‌లో పేర్కొంది.

ఈ మధ్యకాలంలో మూడు లక్షల దిగువకు కరోనా కేసులు నమోదు కావడం ఇదే రెండోసారి. సోమవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే- 17,853 పాజిటివ్ కేసులు తగ్గాయి. మరణాల్లో మాత్రం భారీ పెరుగుదల చోటు చేసుకుంది. కిందటి రోజు, తాజా బులెటిన్‌తో పోల్చుకుంటే 223 మరణాలు అధికంగా కనిపించాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. ఢిల్లీ దాదాపు నెలరోజులుగా సంపూర్ణ లాక్‌డౌన్‌లో ఉంటోంది. తెలంగాణ సహా తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర.. ఇలా దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. ఏపీ వంటి మరి కొన్ని రాష్ట్రాలు పాక్షికంగా లాక్‌డౌన్ అమలు చేస్తోన్నాయి.

కరోనా కట్టడికి దాదాపు అన్ని రాష్ట్రాలు తీసుకుంటోన్న చర్యల వల్ల రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయనే అంచనాలు ఉన్నాయి. మరణాల్లో మాత్రం ఉధృతి తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోసారి మృతుల సంఖ్య నాలుగు వేల మార్క్‌ను అధిగమించింది. మహారాష్ట్ర, కర్ణాటకల్లో అత్యధిక కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్ల షార్టేజీ, ఆసుపత్రుల్లో చాలినన్ని పడకలు అందుబాటులో లేకపోవడం వంటివి మరణాలు పెరగడానికి కారణమౌతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+