కరోనా నుండి ఉపశమనం పొందుతున్న భారత్ .. 8 లక్షలకు తగ్గిన యాక్టివ్ కేసులు

భారతదేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా ఉధృతి అదుపులోకి వస్తుంది. దేశంలో రికవరీ రేటు 96 శాతానికి చేరువైంది. క్రియాశీల కేసులు సైతం 8 లక్షలకు తగ్గాయి. తాజా పరిస్థితిని చూస్తే వరుసగా 10 వ రోజు భారతదేశంలో రోజువారి కేసులు 100,000 మార్కు కంటే తక్కువగా ఉన్నాయి.

గత 24 గంటల్లో ఇండియాలో 67, 208 కొత్త కేసులు నమోదు కాగా, 2330 మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి బారిన పడిన వారి మొత్తం సంఖ్య 2.97 కోట్లకు చేరుకుంది. గత 24 గంటల్లో 1,03,570 మంది ప్రజలు ఈ వ్యాధి నుండి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీలు 28,491,670 గా నమోదు అయ్యాయి. ప్రస్తుతం రికవరీ రేటు 95.93 శాతానికి పెరిగింది.

India recovering from corona .. Active cases reduced to 8 lakhs

ఇక క్రియాశీల కేసుల విషయానికి వస్తే 8,26,740 కు క్షీణించాయి .దీంతో ఇప్పుడు క్రియాశీల కేసులు మొత్తం కేసులలో 2.92% ఉన్నాయి. కోవిడ్ -19 మహమ్మారి నిర్ధారణ కోసం ఇప్పటివరకు మొత్తం 38,52,38,220 నమూనాలను పరీక్షించామని, గత 24 గంటల్లో 19,31,249 పరీక్షలు నిర్వహించామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) గురువారం తెలిపింది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గినందున, కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి విధించిన లాక్డౌన్ వంటి పరిమితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ సడలింపులను ప్రకటించాయి.

కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివెయ్యగా, కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి .ఇదిలా ఉంటే ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 26,55,19,251 వ్యాక్సిన్ డోసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నిన్న ఒక్క రోజే 34,63,961మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు.

Recommended Video

    #TOPNEWS: AP 10th And Inter Exams| Kadtal Farmhouse|Vizag Steel Plant Privatization| Oneindia Telugu

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+