ప్రముఖ రాజకీయ వ్యూహకర్తకు డీకే శివకుమార్ కీలక పదవి, ఆపరేషన్ సౌత్..!!

దక్షిణాది రాష్ట్రాల పై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. కేరళ లో గెలుపు... తమిళనాడులో విజయ్ ప్రభుత్వం లో భాగస్వామి అయిన తరువాత జోరు పెంచింది. కర్ణాటకలో సిద్దరామయ్య ను మార్చి డీకే శివకుమార్ ను సీఎం చేసింది. ఇక.. తెలంగాణలో రేవంత్ కు కీలక మార్గనిర్దేశం చేసిన పార్టీ అధిష్టానం.. కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా కాంగ్రెస్ వ్యూహకర్తకు డీకే శివ కుమార్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. అక్కడి నుంచే ఆపరేషన్ సౌత్ అమలు చేసేలా ప్రణాళికలు సిద్దం చేసింది.

కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కు కీలక బాధ్యతలు అప్పగించారు. డీకే శివకుమార్ ప్రభుత్వం లో కేబినెట్ హోదాతో సలహాదారు పదవి కేటాయించారు. గతంలో సిద్దరామయ్య ప్రభుత్వంలోనూ సునీల్ ఇదే హోదాలో పని చేసారు. కాంగ్రెస్ కర్ణాటక, తెలంగాణలో గెలుపు వెనుక గతంలో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు.

 ఢిల్లీకి చంద్రబాబు, పవన్ - కేబినెట్ లో మరో బెర్తు.. కీలక నిర్ణయాలు..!!
ఢిల్లీకి చంద్రబాబు, పవన్ - కేబినెట్ లో మరో బెర్తు.. కీలక నిర్ణయాలు..!!
poll-strategist-sunil-kanugolu-has-been-appointed-as-chief-advisor-to-cm-dk-shivakumar-with-cabinet

దక్షిణాది రాష్ట్రాల పై కాంగ్రెస్ ఫోకస్


కనుగోలు 2022లో కాంగ్రెస్ పార్టీలో ప్రచార వ్యూహాల విభాగానికి అధిపతిగా చేరారు మరియు పార్టీ యొక్క 'టాస్క్ ఫోర్స్ 2024'లో సభ్యుడిగా కూడా ఉన్నారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచార ప్రణాళిక, సందేశాల రూపకల్పన మరియు సర్వేల ఆధారంగా ఓటర్లను సంప్రదించే ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించారు. కర్ణాటకలో అప్పటి బీజేపీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మ పైన వ్యూహాత్యక ప్రచారం కలిసి వచ్చింది. "PayCM" మరియు "40% సర్కార్" వంటి ప్రచార అస్త్రాలను రూపొందించి అమలు చేసిన సునీల్.. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు దోహదం చేసింది. కాంగ్రెస్ వెనుకంజలో ఉన్న నియోజకవర్గాలను గుర్తించి వాటిల్లో ప్రత్యేక వ్యూహాలను అమలు చేసి.. పార్టీ అధికారంలోకి రావటంలో క్రియాశీలకంగా సునీల్ వ్యవహరించారు.కనుగోలు 2022లోనే కాంగ్రెస్‌లో అధికారికంగా చేరినప్పటికీ, అప్పటికే దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న రాజకీయ వ్యూహకర్తలలో ఒకరిగా మంచి గుర్తింపు పొందారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్‌తో కలిసి పనిచేసిన సునీల్.. ఆ తరువాత తన టీంతో పలు రాష్ట్రాల్లో పని చేసారు.2015లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేపట్టిన "నమక్కు నామే" ప్రచారాన్ని రూపొందించడంలోనూ, డీఎంకే తరపున ఎన్నికల ప్రధాన అంశంగా 'తమిళ అస్తిత్వం' అనే భావనను ముందుకు తీసుకురావడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన అన్నాడీఎంకేతో పనిచేశారు. తెలంగాణ లో 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు కోసం నాడు ఎన్నికల హామీలు... ప్రచార తీరును స్వయంగా రూపొందించారు. రేవంత్ తో కలిసి వ్యూహాలు అమలు చేసి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. ఇక.. కర్ణాటక, తెలంగాణతో సహా దక్షిణాదిలో పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ సౌత్ బాధ్యతలు అప్పగించిన సునీల్ కనుకోలుకు కర్ణాటక ప్రభుత్వంలో మరోసారి కీలక పదవి కట్టబెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+