వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ అరలక్షకు టచ్ చేసేలా: వరుసగా ఆరో రోజు.. అదే ఉధృతి: 15 లక్షలకు చేరువగా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పూ కనిపించట్లేదు. కొద్దిరోజులుగా 50 వేలకు అటుఇటుగా నమోదవుతోన్న పాజిటివ్ కేసులు.. మరోసారి అదే రేంజ్‌లో రికార్డు అయ్యాయి. వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తూనే వస్తున్నాయి. మరోసారి అరలక్షకు చేరువ అయ్యేలా కొత్త కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 47,704 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 654 మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యశాఖ మంత్రిత్వశాఖ తాజా బులెటిన్‌ను కొద్దిసేపటి కిందట విడుదల చేసింది. 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం వరుసగా ఇది ఆరోసారి.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులతో దేశంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 15 లక్షలకు చేరువగా వెళ్లింది. ఇప్పటిదాకా 14,83,157 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 33,425 మంది మరణించారు. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 9,52,744కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,96,988గా నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు వేల సంఖ్యల్లో నమోదు అవుతున్నాయి. ఏపీ, కర్ణాటకల్లో ఒకేరోజు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటుకున్నాయి.

India registered Newly 47,704 positive cases and 654 deaths past 24 hours

దేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా నమోదవుతోంది. తాజా లెక్కల ప్రకారం.. దేశ జాతీయ సగటు రికవరీ రేటు 64.23 శాతంగా నమోదైంది. 14,83,157 కేసులు ఇప్పటిదాకా నమోదు కాగా.. అందులో యాక్టివ్‌గా ఉన్నవి 4,96,988. ఇప్పటిదాకా 9,52,744 మంది డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకున్నారు. రికవరీ రేటు కొత్త ఆశలు రేపుతోన్నప్పటికీ.. అదే సమయంలో మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. రోజువారీ లెక్కల్లో మరణాల సంఖ్య అధికంగా ఉంటోంది. 500లకు ఏ మాత్రం తగ్గకుండా రోజువారీ మరణాలు రికార్డు అవుతున్నాయి. తాజాగా 654 మంది మరణించారు.

నియంత నోట..యుద్ధం మాట: సెకెండ్ కొరియన్ వార్: మా బలాలు అవే: జోలికి రావట్లేదునియంత నోట..యుద్ధం మాట: సెకెండ్ కొరియన్ వార్: మా బలాలు అవే: జోలికి రావట్లేదు

ఏపీతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఉత్తర ప్రదేశ్, బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులకు ఏ మాత్రం కళ్లెం పడట్లేదు. ఫలితంగా జాతీయ స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడుల్లో కరోనా కల్లోలాన్ని రేపుతోంది. ఆయా రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువే. ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. ఇదివరకు లేనివిధంగా ఏపీలో భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.

English summary
ndia for the sixth day in a row recorded more than 45,000 cases with 47,704 new cases taking the country's tally to over 14.83 lakh cases. With 654 fresh deaths, India's death toll rose to 33,425. Meanwhile, the country also conducted over 5 lakh Covid-19 tests in a single day for the second day in a row. India's recovery rate has improved to 64.23%
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X