కరోనా విలయం: షాకింగ్ రిపోర్ట్ -మే15 కల్లా పతాక స్థాయికి వైరస్ వ్యాప్తి -35లక్షల కేసులు -తగ్గేదెప్పుడు?
దేశంలో కరోనా మహ్మారి రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించిన లెక్కల ప్రకారం, రోజువారీ కొత్త కేసుల్లో భారత్ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పింది. కొత్తగా 3.32 లక్షల కేసులు, 2,263 మరణాలు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులు కొవిడ్ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ విలయానికి తోడు ఆక్సిజన్ కొరత అందరినీ కలవరపెడుతున్నది. మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ డిమాండ్లు వ్యక్తమవుతుండగా, ప్రస్తుత పరిస్థితిని ఎమర్జెన్సీతో పోల్చుతూ, కొవిడ్ పై జాతీయ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆందోళనలను మరింత పెంచుతూ..
Recommended Video

అసలు కథ ముందుంది..
భారత్ లో గురువారం నమోదైన 3.14లక్షల కేసులు ప్రపంచ రికార్డు కాగా, కిందటి రోజు కంటే మరో 20వేలు అదనంగా శుక్రవార కొత్తగా 3.32 లక్షల కేసులు వచ్చాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 24.28లక్షలకు పెరగ్గా, వారిలో చాలా మందికి వెంటిలేటర్, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్నారు. కాగా, రాబోయే రెండు వారాల్లో యాక్టివ్ కేసులు మరో 10 లక్షలు పెరగబోతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాన్పూర్ ఐఐటీ శాస్త్రవేత్తలు, వివిధ ఐఐటీల సహచరులతో కలిసి చేసిన అధ్యయన రిపోర్టు తాజాగా వెల్లడైంది..

మే 15 కల్లా వైరస్ పీక్ స్థానానికి..
దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న కోవిడ్ సెకెండ్ వేవ్ మరో మూడు వారాల తర్వాతగానీ పీక్ స్థానానికి చేరబోదని ఐఐటీ సైంటిట్లులు చెప్పారు. మే 11-15 తేదీల మధ్య వైరస్ వ్యాప్తి పతాక స్థాయికి చేరే అవకాశాలున్నాయని, అప్పటిలోగా యాక్టివ్ కేసుల సంఖ్య 33 నుంచి 35 లక్షలకు పెరుగుతాయని పేర్కొన్నారు. అంతేకాదు, ఏప్రిల్ 25-30 కల్లా ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, తెలంగాణాల్లో కొత్త కేసులు పెరిగే అవకాశాలున్నాయని కూడా శాస్త్రవేత్తలు అంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

జూన్ ప్రారంభానికి తగ్గుదల?
మే నెల రెండో వారం నాటికి దేశంలో కొవిడ్ కేసులు పతాక స్థాయికి చేరతాయన్న సైంటిస్టులు.. మే నెలాఖరుల కల్లా కేసులు బాగా తగ్గిపోతాయని, జూన్ తొలివారం నాటికి కొత్త కేసుల ఉధృతి తగ్గొచ్చని అంచనా వేశారు. ఇప్పుడు కొత్త కేసులు ఎంత వేగంగా పెరుగుతున్నాయో, మే 15 తర్వాత అంతే వేగంగా కేసులు తగ్గుముఖం పడుతూ మే నెలాఖరుకి గణనీయంగా తగ్గుతాయని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ తెలిపారు. హర్యానాలోని అశోక యూనివర్శిటీకి చెందిన గౌతమ్ మీనన్ బృందం ఏప్రిల్ మధ్య నుంచి మే మధ్యలోగా సెకెండ్ వేవ్ పతాక స్థాయిలో ఉండవచ్చని అంచనా వేసింది. కాగా, తొలి వేవ్ మాదిరిగానే ఈసారి కూడా సెప్టెంబర్, అక్టోబర్ వరకూ ఇన్ఫెక్షన్ల ఉధృతి తప్పదనీ ఇంకొదరు అధ్యయనకారులు చెబుతున్నారు.
-
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications